
మద్యం మత్తులో యువకుల హల్‌చల్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులతో ఇద్దరు యువకులు మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించిన ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు ప్రధాన రహదారిపై డ్రంకెన్‌డ్రైవ్ టెస్టులు చేస్తుండగా ఇద్దరు యువకులు మద్యం సేవించి బైక్‌పై వస్తున్నారు. వీరిని గుర్తించిన పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ టెస్ట్ నిర్వహించి బైక్‌ను సీజ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనాలు ఆపుతూ.. పోలీసులపైకి దూసుకెళ్తూ హంగామా చేశారు. మరింత మంది పోలీసులు అక్కడికి చేరుకొని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
రామగుండం ఎన్టీపీసీలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తి
జ్యోతినగర్(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 2,600 మెగావాట్లు. ఇందులోని 500 మెగావాట్ల సామర్థ్యం గల 4, 6, 7వ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచినట్లు తెలుస్తోంది. 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల మూడో యూనిట్‌లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం 2,600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులో 900 మెగావాట్లే ఉత్పత్తి అవుతున్నటున్ల సమాచారం. థర్మల్ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ లేక ఉత్పత్తిని తగ్గించినట్లు తెలుస్తొంది.