
అర్చకులను అవమానిస్తే ఊరుకునేది లేదు
ఓదెల(పెద్దపల్లి): అర్చకులను అవమానిస్తే ఊరుకునేది లేదని అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ హెచ్చరించారు. ఓదెల మల్లికార్జునస్వామిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయ ఈవో సదయ్యకు వినతిపత్రం అందజేశారు. ఓదెల మల్లికార్జునస్వామి ప్రధాన అర్చకునితోపాటు మరో అర్చకుడిపై పాలకవర్గ చైర్మన్ దురుసుగా మాట్లాడడం, అగౌరవ పర్చడం శోచనీయమన్నారు. వారి తీరును ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి తీసుకెళ్లగా పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆలయంలో స్వామివారికి నిర్వహించే నిత్యకై ంకర్యాలపై పాలకవర్గం పెత్తనం మానుకోవాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో ఓదెల ఆలయ అర్చకులు, కరీంనగర్, జగిత్యాల జిల్లాల ధూపదీప, నైవేద్య అర్చక నాయకులు పాల్గొన్నారు.