
క్రీడల్లోనూ రాణించాలి
జగిత్యాలరూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా విద్యాధికారి రాము సూచించారు. జగి త్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ జిల్లా పరిషత్‌పాఠశాలలో శుక్రవారం ఉమ్మడి జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్ ఎంపిక పోటీలను ప్రారంభించారు. ఎంపీవో రవిబాబు, టీఎస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, కార్యదర్శులు అశోక్, టీజీ పేట జిల్లా అధ్యక్షుడు రాజమల్లయ్య, ప్రధానోపాధ్యాయురాలు సరోజన, బాస్కెట్‌బాల్ కోర్టు నిర్మాణదాత తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణలో దాడిస్ స్టిక్కర్లు కీలకం
జగిత్యాలరూరల్: రోడ్డు ప్రమాదాల నివారణకు డాడిస్ రోడ్ స్టిక్కర్స్ కవచంలా పనిచేస్తాయని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాటిపల్లి రవాణాశాఖ కార్యాలయంలో డాడిస్ రోడ్డు ప్రాంచైజ్‌ను ప్రారంభించి, రోడ్డు స్టిక్కర్‌ను ఆవిష్కరించారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరికి డాడిస్ రోడ్ స్టిక్కర్స్ కవచంలా పనిచేస్తాయన్నారు. ఈ క్యూఆర్‌కోడ్ స్టిక్కర్ వేసుకోవడం వల్ల 8 రకాల ప్రయోజనాలుంటా యన్నారు. ప్రమాద, సందేశం, రక్తనిధి, పా ర్కింగ్ సమస్య, పత్రాలు భద్రపర్చుట, రిమైండర్లు, లాక్ హెచ్చరిక, టోయింగ్ హెచ్చరిక లాంటి ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఎంవీఐ లు రామారావు, డాడీస్ రోడ్ ఆఫ్ జగిత్యా ల జి ల్లా మేనేజర్ ఆడెపు వెంకటేశ్, కందుకూరి స్వా మి, పర్వతం, సతీశ్, మహేందర్ పాల్గొన్నారు.
తలనీలాల టెండర్‌కు దరఖాస్తుల ఆహ్వానం
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు ఈ నెల 23న మధ్యాహ్నం 3గంటలకు వేలం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. దేవాలయం చేత పోగు చేయబడిన 7 నెలల తలనీలాల కోసం దరావత్తు సొమ్ము 10లక్షలతోపాటు రూ.2,360, ఆలయంలో పోగు చేయబడిన 3 నెలల తలనీలాలకు రూ.5 లక్షలతోపాటు రూ.2,360 ఏదేని జాతీ య బ్యాంకులో డీడీ రూపంలో చెల్లించి, ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ద రఖాస్తులు అందజేయాలని ఈవో తెలిపారు. 23న మధ్యాహ్నం 3గంటలకు తలనీలాలు కిలోల చొప్పున బహిరంగ వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలు పాటించాలి
ధర్మపురి: పత్తి రైతులు ప్రభుత్వ విధానాలను పాటించాలని జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్ సూచించారు. మండలంలోని తుమ్మెనాల గ్రామంలో శుక్రవారం పత్తి రైతులతో స మావేశమయ్యారు. పత్తి విక్రయించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. పత్తిని సీసీఐకి విక్రయించే విధానం, కప్పస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్, మైబెల్ నంబర్ అప్డెషన్ గురించి సూచించారు. వరి కోతల్లో హార్వెస్టర్లు ఫ్యాను స్పీడు 18–20 ఆర్‌పీఎం ఉండేలా చూసుకోవాలన్నారు.

క్రీడల్లోనూ రాణించాలి