
లిక్కర్ టెండర్లకు నేడే ఆఖరు
జగిత్యాలక్రైం: లిక్కర్ టెండర్ల ఘట్టం చివరిదశకు చేరింది. టెండర్లకు మరికొద్ది గంటలు మాత్రమే గడువు ఉండగా.. అరకొరగా వచ్చిన దరఖాస్తులు ఎకై ్సజ్ వర్గాలను కలవరానికి గురి చేస్తున్నా యి. చివరిరోజు దరఖాస్తులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. గుడువు ముగిసే వరకు క్యూలో ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీ కరిస్తామని ఆబ్కారీ అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 2025–27 ఏడాదికి జిల్లాలో 71మద్యం షాపుల నిర్వహణకు టెండర్లు ఆహ్వా నించింది. శుక్రవారం 441 దరఖాస్తులు రాగా.. మొత్తంగా 884 వచ్చాయి. రెండేళ్ల క్రితం 2,636 దరఖాస్తులు రాగా.. సగం కూడా రాకపోవడానికి కారణమేంటని ఆబ్కారీవర్గాలు ఆలోచనలో పడ్డా రు.వ్యాపారం బాగా నడిచే షాపులపై చాలా మంది మక్కువ చూపుతున్నారు. చివరి వరకు వేచి చూసి, వాటికి దరఖాస్తు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. శనివారం సాయంత్రం 5 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్న ప్రతి దరఖాస్తును స్వీకరిస్తామ ని ఎకై ్సజ్ అధికారి సత్యనారాయణ వివరించారు.