
‘సాక్షి’ గొంతునొక్కే ప్రయత్నం
జగిత్యాల: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తున్న ‘సాక్షి’ మీడియా గొంతు నొక్కాలనే ప్రయత్నం చేస్తోందని జగిత్యాల జిల్లా పాత్రికేయులు మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయానికి ఏపీ పోలీసులు వచ్చి ఎడిటర్ ధనంజయ్‌రెడ్డిని నోటీసుల పేరుతో వేధింపులకు గురిచేయడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తాలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. సాక్షి ఎడిటర్‌పై వెంటనే కేసులు ఎత్తివేయాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినదించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి ఏవో రవికాంత్‌కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులు కందుకూరి శశిధర్, శేఖర్, కుమార్, మల్లారెడ్డి, సుబ్బారెడ్డి, శ్రీకర్, చంద్రశేఖర్, విజయ్‌కుమార్, గణేశ్, వెంకటేశ్వర్లు, రాంరెడ్డి, రమేశ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి
జగిత్యాలలో పాత్రికేయుల నిరసన