
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు జైకుమార్ అన్నారు. కాంగ్రెస్ డీసీసీ అధ్యక్ష, నియమకంపై సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశం శుక్రవారం జగిత్యాలలోని ఏబీ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జైకుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం దిశగా హైకమాండ్ తీసుకుంటున్న చర్యలకు కట్టుబడి పనిచేయాలన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కార్యకర్తలకు పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలు చేశారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రతీ కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందన్నారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి, రాష్ట్రంలో ప్రభుత్వం రావడానికి కార్యకర్తల కృషి ఎంతో ఉందన్నారు. ప్రజాస్వామ్యయుక్తంగా అధ్యక్షుడి ఎంపికకు కార్యకర్తల అభిప్రాయం సేకరించడం అభినందనీయమన్నారు. పీసీసీ పరిశీలకులు ఫకృద్దీన్ రా య్, కేతూరి వెంకటేశ్, బాసిత్, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు పాల్గొన్నారు.