
అర్హులకు ఇళ్లు ఇవ్వండి
● బల్దియా కార్యాలయం ఎదుట బైఠాయించిన మాజీమంత్రి
జగిత్యాల: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమాచారం లేకుండా వార్డుల్లో సభలు నిర్వహించి కొందరికే ఇళ్లు కేటాయించారంటూ బల్దియా ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. అర్హులతోపాటు అనర్హుల జాబితా ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. డబుల్‌బెడ్‌రూం నిర్మాణలో స్థలాలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేస్తారన్న సమాచారం మేరకు మున్సిపల్ సిబ్బంది కార్యాలయానికి గేట్లు వేశారు. సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.