విద్యకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

విద్యకు ప్రాధాన్యం

Oct 16 2025 5:49 AM | Updated on Oct 16 2025 5:49 AM

విద్యకు ప్రాధాన్యం

విద్యకు ప్రాధాన్యం

జగిత్యాల: విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఇందులోభాగంగానే జిల్లా కేంద్రంలోని పురాణిపేట ఉన్నత పాఠశాలకు రూ.13.50 లక్షలతో సైన్స్‌ల్యాబ్‌ నిర్మించామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కా ర్పొరేట్‌ విద్య అందుతోందన్నారు. డీఈవో రాము మాట్లాడుతూ పాఠశాలల్లో సైన్స్‌ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుందన్నారు. సైన్స్‌ అధికారి మచ్చ రాజశేఖర్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాగభూషణం, ఏఈ ధనుంజయ్‌, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆనందరావు, అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

డంపింగ్‌ యార్డుకు పెన్సింగ్‌

డంపింగ్‌యార్డుకు పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బుధవారం అర్బన్‌ హౌసింగ్‌ కాలనీ అభివృద్ధి పనులు పరిశీలించారు. కాలనీలో చేపడుతున్న సీసీరోడ్లు, డ్రైన్లను పరిశీలించారు. కమిషనర్‌ స్పందన, డీఈ మిలింద్‌, ఏఈ అనిల్‌ పాల్గొన్నారు. ముందుగా రిటైర్డ్‌ ఉద్యోగుల కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

పోషకాహారంతోనే ఆరోగ్యం

జగిత్యాలరూరల్‌: పోషకాహారంతోనే తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే అన్నారు. అంతర్గాంలో పోషణ మాసం కార్యక్రమంలో పాల్గొన్నా రు. గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవా లన్నారు. సంక్షేమాధికారి నరేశ్‌, తహసీల్దార్‌ వరందన్‌, ఎంపీడీవో రమాదేవి, సీడీపీవో మమత, ఎంఈవో గంగాధర్‌ పాల్గొన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం తాటిపల్లికి చెందిన బెరిగేడి నర్సయ్యకు రూ.2.50 లక్షల విలువైన ఎల్‌వోసీ అందించారు.

ఆర్నెళ్లకోసారి గాలికుంటు నివారణ టీకాలు

జగిత్యాలఅగ్రికల్చర్‌: పశువులకు ప్రతి ఆర్నెళ్లకోసారి ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలను పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతర్గాంలో పశువులకు టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా పశువైద్యాధికారి ప్రకాష్‌ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 69 బృందాలు టీకాలు వేస్తున్నాయన్నారు. పశువైద్య సహాయ సంచాలకులు నరేశ్‌, పశువైద్యులు నరేశ్‌ రెడ్డి, వేణుగోపాల్‌, కిరణ్‌రెడ్డి, బద్దం రాజేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement