
ఆరుగాలం.. దళారుల పరం
ఇబ్రహీంపట్నం: ఆరుగాలం శ్రమించి పండించిన సోయాబీన్ పంటను కొనేవారు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో ఈ వర్షకాలంలో 650 ఎకరాల్లో సోయాబిన్ సాగు చేశారు. వర్షాలు సంమృద్ధిగా పడడంతో ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు ప్రక్రియ చేపట్టకపోవడంతో దళారులకు తెగనమ్ముకుంటున్నారు. సోయాబిన్ క్వింటాల్‌కు రూ.5,328 ఉండగా.. దళారులు రూ.4వేలు మాత్రమే చెల్లిస్తూ.. రైతులను నిండా ముంచుతున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు విన్నవిస్తున్నా, ఇటీవల మెట్‌పల్లిలో ధర్నా చేసినా.. అధికారుల్లో చలనం లేదంటున్నారు రైతులు. ఓ వైపు మబ్బులు భయపెడుతున్నాయని, వర్షం కురిస్తే ఆరబెట్టిన సోయా తడిసే అవకాశముందని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
దళారులకు అమ్ముకుంటున్నాం
కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో చేతికందిన సోయాబిన్‌ను విధిలేక దళారులకు అమ్ముకుంటున్నాం. దళారులకు అమ్మడం ద్వారా క్వింటాల్‌కు రూ.వెయ్యి నష్టపోతున్నాం. – ఏలేటి ప్రతాప్‌రెడ్డి, రైతు, ఇబ్రహీంపట్నం
కేంద్రాలు ప్రారంభించాలి
నేను రెండెకరాల్లో సోయా వేశా. 20 క్వింటాళ్ల దిగుబడి వ చ్చింది. ప్రభుత్వం కొనకపోవడంతో దళారులు క్వింటా ల్‌కు రూ.4వేల చొప్పున పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించి కేంద్రాలు ప్రారంభించాలి. – ఇట్టెడి భీంరెడ్డి, రైతు, ఇబ్రహీంపట్నం

ఆరుగాలం.. దళారుల పరం

ఆరుగాలం.. దళారుల పరం