
సర్వేల ఆధారంగానే రన్‌వే
రామగుండం: ఆరంచెల విధానంలో వచ్చే నివేదికల ఆధారంగానే అంతర్గాంలో విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ లభించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో చేపట్టిన ప్రీఫిజిబిలిటీ నివేదిక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.40.53 లక్షలు మంజూరు చేయడం ద్వారా ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు తొలిఅడుగు పడినట్లు ఆశలు రేకెత్తుతున్నాయి. వివిధ విభాగాల అత్యున్నతస్థాయి నిపుణులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో ఆరుదశల్లో సర్వే చేపడతారని, తుది నివేదికను ఎయిర్‌ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి అందజేస్తారని అధికారులు చెబుతున్నారు. రూపొందించనున్నారు.
ఆరు దశల్లో..
విమానాశ్రయం ఏర్పాటు జాతీయ భద్రత, పర్యావరణం, రవాణా, ఆర్థిక, ప్రజావసరాలతో ముడిపడి ఉందని అంటున్నారు. తొలిదశలో ప్రయాణికుల డిమాండ్, వాణిజ్య అవసరాలు, రవాణా సౌకర్యాలపై ఆయా విభాగాల ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తారు. మలిదశలో స్థలం ఎంపికపై భౌగోళిక పరిస్థితులు, నేల స్వభావం, ఎత్తు, ప్రధాన పట్టణాలకుదూరం, రోడ్లు, రైలు కనెక్టివిటీ పరిశీలిస్తారు. మూడోదశలో భూమి ఎత్తుపల్లాలు, పర్వతాలు, లోయలు, నదులు, రోడ్లు, సరస్సుపై పరిశోధన చేస్తారు. నాలుగో దశలో పర్యావరణ ప్రభావంపై అధ్యయం చేస్తారు. ఐదోదశలో నిర్వాసితులకు పునరావాసం, ఉపాధి కల్పన, వ్యాపార, ప్రాంతీయ అభివృద్ధి ప్రభావంపై సర్వే చేస్తారు. ఆరోదశలో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరెక్టర్ జనరల్ ఏవియేషన్ అథారిటీ, ఏఏఐ, కేంద్ర, రాష్ట్ర క్యాబినెట్ అత్యున్నత ప్రతినిధులతో డీపీఆర్ తయారీ, ఆర్థిక అంచనా, బడ్జెట్ ఆమోదం, నిర్మాణానికి తుది అనుమతులు, టెండర్ల విడుదల ద్వారా విమానాశ్రయానికి రన్‌వే సిద్ధమైనట్లు ప్రకటిస్తారు.
అంతర్గాంలో విమానాశ్రయంపై నివేదిక
అన్నీబాగుంటేనే అడుగుముందుకు
ప్రారంభమైన వివిధ శాఖల సర్వే
పక్కాగా ఆరంచెల విధానం అమలు