
రాజరాజేశ్వరుని సన్నిధిలో మంత్రి అడ్లూరి
ధర్మపురి: ధర్మపురిలోని శ్రీఅక్కపెల్లి రాజరాజేశ్వర స్వామిని సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి స్వామివారి ప్రసాదం అందించారు.
గురుకులాలకు రూ.60 కోట్లు
గురుకులం పాఠశాలలు, కళాశాలల్లో వసతులకు సీఎం రూ.60 కోట్లు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. ఎస్సీ, బీసీ సొసైటీలకు రూ.20 కోట్లు, ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు రూ. 10 కోట్ల చొప్పున మంజూరయ్యాయన్నారు.
విద్యార్థులకు ఆన్‌లైన్ వ్యాసరచన పోటీలు
జగిత్యాలక్రైం: ఈనెల 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ‘పోలీస్ ఫ్లాగ్ డే’ సందర్బంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. పోటీ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉంటుందని, 6వ తరగతి నుంచి పీజీ విద్యార్థులు పాల్గొనవచ్చని, తమ వ్యాసాలను ఈనెల 28 లోపు సమర్పించాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన ముగ్గురిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు. పోటీల్లో పాల్గొన్న వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామన్నారు. ‘డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర.. ‘విద్యార్థులు డ్రగ్స్ నుంచి ఎలా దూరంగా ఉండగలరు..’ అనే అంశంపై వ్యాసరచన పోటీ ఉంటుందని, ఆసక్తి గలవారు https://forms.gle/jaWdt2yhNr Mpe3A లింక్‌పై క్లిక్ చేసి చేసి పేరు, విద్యార్హత, ఇతర వివరాలు నమోదు చేయాలని, వ్యాసాన్ని 500 పదాలకు మించకుండా పేపర్‌పై రాసి, దానిని ఫొటోతీసి ఇమేజ్/పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు.
సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడే అవకాశం
జగిత్యాల: సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని ఐఎంఏ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో వాకర్స్ అసోసియేషన్ వారికి సోమవారం అవగాహన కల్పించారు. గుండెపోటు బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని రక్షించేందుకు సీపీఆర్ ఉపయోగపడుతుందన్నారు. కోశాధికారి సుధీర్‌కుమార్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
రోడ్డెక్కిన బీసీ సంఘాలు
కొడిమ్యాల: రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని పేర్కొంటూ మండలంలోని పూడూర్‌లో కరీంనగర్ – జగిత్యాల రహదారిపై సోమవారం బీసీ నాయకులు బైటాయించారు. ప్రభుత్వం ఖరారు చేసిన 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, నోటికాడి ముద్ద లాక్కోవద్దని, బీసీలను చిన్నచూపు చూడొద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు బింగి మనోజ్, రాచకొండ చందు పాల్గొన్నారు.

రాజరాజేశ్వరుని సన్నిధిలో మంత్రి అడ్లూరి

రాజరాజేశ్వరుని సన్నిధిలో మంత్రి అడ్లూరి