
ఆలకించండి.. పరిష్కరించండి
జగిత్యాలటౌన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లానలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ సత్యప్రసాద్ వారి నుంచి అర్జీలు స్వీకరించారు. 55 అర్జీలు రాగా.. పరిశీలించిన ఆయన సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, జగిత్యాల, మెట్‌పల్లి కోరుట్ల ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, జివాకర్ పాల్గొన్నారు.
చెరువుల్లో పూడిక తీయించండి
మాది జగిత్యాల రూరల్ మండలం నాగునూర్. గ్రామంలో నాగులకుంట, బొట్లకుంట చెరువుల్లో పూడిక పేరుకుపోయింది. చెరువు సామర్ధ్యం తగ్గి సాగు, తాగునీటి అవసరాలకు ఇబ్బందిగా మా రింది. ఈ చెరువుల కింద వంద ఎకరాలు సాగవుతుంది. పూడిక పేరుకుపోయి బావులు, బోర్లు వట్టిపోతున్నాయి. చెరువుల్లో పూడిక తీస్తే కొంత మేలు జరుగుతుంది.
– నాగునూర్ గ్రామ రైతులు

ఆలకించండి.. పరిష్కరించండి