
‘ఇందిరమ్మ’ ఇళ్లు పూర్తికావాలి
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గృహనిర్మాణం, మున్సిపల్ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. జిల్లాకు 10,982 ఇళ్లు మంజూరు కాగా.. 7,343కు మార్క్‌అవుట్ చేశామని, 2,984 బేస్‌మెంట్, 721 లెంటల్, 369 స్లాబ్ దశకు వచ్చాయని, మూడు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా 22వ స్థానంలో ఉందని, అధికారులు సమన్వయంగా పనిచేసి మొదటి ఐదు స్థానాల్లో ఉండేలా చూడాలన్నారు. ఇసుక బజార్ నుంచి లబ్ధిదారులు ఇసుక పొందవచ్చన్నారు. బిల్లుల్లో జాప్యం ఉన్నా, సమస్యలున్నా తన దృష్టికి తేవాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, డిప్యూటీ అదనపు కలెక్టర్ హారిణి, హౌసింగ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు.
కార్డియక్ అరెస్ట్‌తోనే మరణాలు
కార్డియక్ అరెస్ట్‌తోనే యుక్త వయస్సులో చాలామంది చనిపోతున్నారని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కార్డియో పల్మనరి రిసాసిటేషన్ వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్‌లో సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని అన్నిచోట్ల వారంపాటు అవగాహన కల్పిస్తామన్నారు.