
అర్హులకు ‘డబుల్’ ఇళ్లు కేటాయించండి
జగిత్యాల: అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూం కేటా యించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కలెక్టర్ సత్యప్రసాద్‌కు సూచించారు. ఇంకా మిగిలిన 859 ఇళ్లను అర్హులకు ఇంతవరకు లబ్ధిపొందని వారికి.. గతంలో 2008లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై అసంపూర్తిగా వదిలేసిన వారికి కేటాయించాలని కోరారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల వద్ద మిగిలిపోయిన అంతర్గత పనులు, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి లేఖ రాశారు. ఇస్లాంపురకు చెందిన సయ్యద్ ఫజుల్‌కు రూ.21,500 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందించారు. ఎమ్మెల్యేను మిషన్ భగీరథ ఈఈ జానకి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ధరూర్ క్యాంప్‌లోని కేజీబీవీ పాఠశాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. వసతులు, స్టోర్‌రూమ్, వంటగది శుభ్రతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, నాయకులు సుధాకర్, పృథ్వీ, ప్రశాంత్‌రాజ్, రాజ్‌కుమార్, ప్రిన్సిపల్ కవిత పాల్గొన్నారు.