
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
జగిత్యాల: ప్రైవేట్ ఆస్పత్రులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. మంగళవారం బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కమిటీ జిల్లాస్థాయి సమావేశంలో మాట్లాడారు. ఆస్పత్రులు కచ్చితంగా క్లినికల్ ఎస్లాబ్లిష్‌మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. మున్సిపల్ వాహనాలకు బయో మెడికల్ వేస్ట్‌ను అందించొద్దన్నారు. ఏజెన్సీ వారికి అప్పగించాలన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 302 ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నాయన్నారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ స్పందన, మోహన్ పాల్గొన్నారు.