200 రకాల నైవేద్యం | - | Sakshi
Sakshi News home page

200 రకాల నైవేద్యం

Oct 1 2025 10:05 AM | Updated on Oct 1 2025 10:05 AM

200 ర

200 రకాల నైవేద్యం

సింహ వాహనంపై నృసింహుడు
సిద్దిధాత్రిగా అమ్మవారు
మెట్‌పల్లి:మెట్‌పల్లి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి. ఆలయంలో మంగళవారం పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి 200 రకాల ఫలహారాలు తయారు చేసి, నైవేద్యంగా సమర్పించారు.ప్రత్యేక పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ధర్మపురి: శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం యోగ, ఉగ్ర శ్రీలక్ష్మీనృసింహస్వాములను సింహ వాహనంపై పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. దారి పొడవన మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. దేవస్థానం ఈవో శ్రీనివాస్‌, చైర్మన్‌ జక్కు రవీందర్‌, అర్చకులు పాల్గొన్నారు.

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధ శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో దసరా నవరాత్రోత్సవాలు వైభవంగా జరిపిస్తున్నారు. 9వ రోజు మంగళవారం అమ్మవారు సిద్దిధాత్రి రూపంలో దర్శనమిచ్చారు.

చిలుక వాహనంపై శ్రీవారు

కోరుట్ల: పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర, అష్టలక్ష్మీ ఆలయాల్లో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అష్టలక్ష్మి ఆలయంలో లక్ష్మీనారాయణుడు చిలుక వాహనంపై, వేంకటేశ్వరస్వామి సింహవాహనంపై ఊరేగారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు యతిరాజం నర్సయ్య, బురుగు రామస్వామిగౌడ్‌ పాల్గొన్నారు.

బీర్‌పూర్‌ నృసింహస్వామికి శేషవాహనసేవ

సారంగాపూర్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం బీర్‌పూర్‌ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం సన్నిధిలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారిని, అమ్మవారిని శేషవాహనంపై ఊరేగించారు. భక్తుల నృసింహ నామస్మరణలతో క్షేత్ర కొండలు మార్మోగాయి.

200 రకాల నైవేద్యం 1
1/4

200 రకాల నైవేద్యం

200 రకాల నైవేద్యం 2
2/4

200 రకాల నైవేద్యం

200 రకాల నైవేద్యం 3
3/4

200 రకాల నైవేద్యం

200 రకాల నైవేద్యం 4
4/4

200 రకాల నైవేద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement