
పురాణ నిధి యాప్ ఆవిష్కరణ
కరీంనగర్ కల్చరల్: దేవతా స్త్రోత్రాలతోపాటు పురాణ గాథలన్నీ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రూపొందించిన ‘పురాణ నిధి’ యాప్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పండితులు మంగళంపల్లి వేణుగోపాలశర్మ, పురాణం మహేశ్వరశర్మతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేవతలు, హిందూ శాస్త్రాలకు సంబంధించి సామాన్యుల్లో నెలకొన్న అనేక సందేహాలను ఈ యాప్ ద్వారా నివృత్తి చేస్తుండటం సంతోషించదగ్గ పరిణామమన్నారు.
బతుకమ్మ వేడుకల్లో ప్రొటోకాల్ వివాదం?
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చింతకుంట చెరువు వద్ద నిర్వహించిన మహా బతుకమ్మ వేడుకల్లో ప్రొటోకాల్‌పై విమర్శలు వస్తున్నాయి. వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథులకు మెమోంటోలు అందజేశారు. ఇందులో కలెక్టర్ ఫొటో లేకపోవడం, ఇతరుల ఫొటోలు ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఫొటోను సైతం చిన్నగా ప్రచురించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రి లక్ష్మణ్‌కుమార్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయం ఇప్పుడు జగిత్యాలలో హాట్ టాఫిక్‌గా మారింది.
రైల్వేస్టేషన్‌లో సమస్యలు పరిష్కరించాలి
కోరుట్ల: పట్టణ శివారులోని రైల్వేస్టేషన్‌లో సమస్యలు పరిష్కరించాలని అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు మంగళవారం రైల్వేస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. తొమ్మిదేళ్ల క్రితం రైల్వేస్టేషన్ నిర్మాణం జరిగినా ఇప్పటి వరకు కల్లూర్ రోడ్డు నుంచి రైల్వేస్టేషన్ వరకు సరైన రోడ్డు సౌకర్యం, పార్కింగ్ స్థలం కూడా లేదన్నారు. ముంబాయి, హైదరాబాద్, తిరుపతి, వరంగల్, విజయవాడ, తదితర నగరాలకు వెళ్లేరైళ్లకు కోరుట్ల రైల్వేస్టేషన్లో హాల్టింగ్ కల్పించాలని అధికారులకు వినతిపత్రం ఇచ్చా రు. ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే కల్వ కుంట్ల సంజయ్ చొరవ చూసి సమస్యలు పరి ష్కరించాలని కోరారు. ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకుడు పేట భాస్కర్, కమ్యూనిస్టు నాయకులు చెన్నా విశ్వనాథం, సుతారి రాములు, చింతా భూమేశ్వర్, సయ్యద్ అన్వర్, భూపెల్లి నాగేష్, రహీం పాషా పాల్గొన్నారు.

పురాణ నిధి యాప్ ఆవిష్కరణ

పురాణ నిధి యాప్ ఆవిష్కరణ