
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
జగిత్యాలటౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు అధ్యక్షతన జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఓటర్లు లేనిచోట రిజర్వేషన్లు
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని గ్రామపంచాయతీ రిజర్వేషన్లపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్మాజీపేట గ్రామం ఓసీ మహిళకు కేటాయించగా ఓసీ ఓటరు ఒక్కరే ఉన్నారు. కన్నాపూర్ గ్రామం ఓసీ మహిళకు కేటా యించగా అక్కడ ఓసీ ఓటర్లు వందశాతం లేరు. వడ్డెరకాలనీ జనరల్‌కు కేటాయించగా అక్కడ జనరల్ ఓటర్లు వందశాతం లేరు. వంజరిపల్లి జనరల్ చేయగా ఒక్క ఓటరు కూడా జనరల్ ఓటరు లేరు.