
ప్రకృతిపై గొడ్డలివేటు
గోదావరిలో నిమజ్జనం
బతుకమ్మతో యువతులు
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ధర్మపురిలో ఉన్న ఎస్‌కేఎన్‌ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల దాదాపు 35 ఎకరాలకు పైన విస్తరించి ఉంటుంది. చుట్టూ ఆహ్లాదకరమైన చెట్లు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌తో పాటు, విద్యార్థులకు తరగతి గదులు నిర్మించారు. ఏళ్లకాలంగా చదువుల కోవెలగా పేరుగాంచింది. ఎంతో మంది ప్రముఖులు ఇక్కడి చెట్ల కిందే విద్యావంతులు అయ్యారు. కళాశాల ఆవరణలో రూ.35కోట్లతో మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకు నిర్మాణానికి పనులు ప్రారంభించారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సమీపంలోనే దీన్ని నిర్మిస్తున్నా రు. ఇందుకోసం ఇప్పటి వరకు ఏపుగా పెరిగిన తొమ్మిది చెట్లను తొలగించారు. పట్టణ ప్రజల కోసమని చెప్పి కళాశాలలోవాటర్ ట్యాంక్ నిర్మించడంతో అసౌకర్యంగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఎడమవైపు దాదాపు 9 గుంటల స్థలంలో పెద్దవాటర్ ట్యాంక్ నిర్మిస్తుండడంతో భవిష్యత్‌లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఇబ్బంది ఏర్పడుతుందని చెబుతున్నారు. కళాశాలలో చాలా మంది వాకర్స్ వాకింగ్ చేస్తుంటారు. వారకీ అసౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. ట్యాంక్ నిర్మాణాన్ని ఆపివేయాలని కోరుతున్నారు.

ప్రకృతిపై గొడ్డలివేటు