
సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి
రాయికల్: సనాతన ధర్మం పరిరక్షణే ఆర్‌ఎస్‌ఎస్ ధ్యేయమని జిల్లా కార్యవాహ్ గోల్కొండ నాగరాజు అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో మంగళవారం ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో శతజయంతి సందర్భంగా విజయదశమి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం పరిరక్షణే ఆర్‌ఎస్‌ఎస్ ధ్యేయమన్నారు. ప్రతి పౌరుడిలో దేశభక్తిని పెంపొందిస్తామన్నారు. ప్రపంచ దేశాలు భారత ఆచార సాంప్రదాయాలను ఆదర్శంగా తీసుకుంటే, కొన్ని ఉగ్రవాద శక్తులు విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, దానికి కొన్ని రాజకీయ పార్టీలు వత్తాసు పాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఖండ కార్యవాహ్ వేల్పుల స్వామియాదవ్, స్వయం సేవకులు చిలువేరి రామస్వామి, పుల్ల కిషన్, శంకర్, గంగాధర్, భూమన్న, గుగ్గిళ్ల రాము, శేఖర్, రవి, కిషన్ పాల్గొన్నారు.