
తల్లిని పట్టించుకోని కొడుకులకు కౌన్సిలింగ్
హుజూరాబాద్‌రూరల్: కొడుకులు పట్టించుకోవడం లేదంటూ మండలంలోని కనుకులగిద్దె గ్రామానికి చెందిన ములుగు రాజమ్మ ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఆర్డీవో రమేశ్‌బాబు గ్రామంలో విచారణ చేపట్టారు. ఒక్కొక్కరూ నెలకు రూ.మూడువేల చొప్పున తల్లి పోషణ నిమిత్తం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు సరిగా అమలవుతున్నాయో లేదా అని తెలుసుకోవడానికి కలెక్టర్, జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలోని బృందం బుధవారం విచారణ చేపట్టింది. విచారణలో రాజమ్మను కుమారులు పట్టించుకోవడం లేదని తేలింది. ఆమె ముగ్గురు కొడుకులకు కౌన్సిలింగ్ ఇచ్చి రాజమ్మను పట్టించుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విచారణలో సోషల్ కౌన్సిలర్ పద్మావతి, డీవీసీ కౌన్సిలర్ ఆరె శేఖర్, ఎస్‌ఆర్వో రఫీ, హెడ్ కానిస్టేబుల్ మధు, మల్లయ్య, మర్రి శ్రీనివాస్ తదితరులున్నారు.