
బైండోవర్ ఉల్లంఘించిన ఏడుగురికి జైలు
మంథని: ముత్తారం మండలం ఖమ్మంపల్లి, పోతారం, మైదంబండ, అడవిశ్రీరాంపూర్, కేశనపల్లి, పారుపల్లి గ్రామాల్లో గుడుంబా విక్రయిస్తూ బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఏడుగురిని బుధవారం తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి ఎదుట బైండోవర్ చేసినట్లు ఆబ్కారీ ఇన్‌స్పెక్టర్ రాజేశ్‌కుమార్ తెలిపారు. దీంతో వారికి ఏడాది జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించారన్నారు. ఈమేరకు నిందితులను రిమాండ్ నిమిత్తం కరీంనగర్‌కు తరలించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో సబ్ ఇన్‌స్పెక్టర్ సాయికుమార్, సిబ్బంది శ్రీనివాస్, మహేందర్, నిరంజన్, వసంత, రవి పాల్గొన్నారు.
మూడిళ్లలో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని అయ్యప్ప ఆలయ సమీపంలోని హరిహర కాలనీలో బుధవారం వేకువజామున తాళం వేసి ఉన్న మూడిళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇళ్ల తాళాలు పగులగొట్టి తులంన్నర బంగారం ఎత్తుకెళ్లారు. ఉదయం పక్కింటి వారు లేచేసరికి డోర్లు తెరిచి ఉండటంతో ఇంటి యజమానులకు సమాచారం అందించారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించగా పట్టణ సీఐ కరుణాకర్ సంఘటన స్థలానికి చేరుకుని హరిహర కాలనీలో సీసీపుటేజీలను పరిశీలించారు. ముగ్గురు దొంగలు ముసుగులు వేసుకుని వెళ్లినట్లు రికార్డు అయింది. సీఐ మాట్లాడుతూ.. ఇళ్లలో విలు వైన వస్తువులు ఉంచవద్దని, బ్యాంక్ ల్యాకర్లలోగానీ భద్రపర్చుకోవాలన్నారు. ప్రతి కాలనీల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.