జాతి సమైక్యతతో ముందుకు సాగాలి | - | Sakshi
Sakshi News home page

జాతి సమైక్యతతో ముందుకు సాగాలి

Sep 18 2025 6:53 AM | Updated on Sep 18 2025 6:53 AM

జాతి

జాతి సమైక్యతతో ముందుకు సాగాలి

జగిత్యాలక్రైం: జాతి సమైక్యతతో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అ న్నారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు ప్రధాన కార్యాలయంలో జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంతో మంది సమరయోధుల పోరాటంతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్‌, రాములు, సీ ఐలు ఆరీఫ్‌అలీఖాన్‌, అనిల్‌కుమార్‌, రాంనర్సింహారెడ్డి, సుధాకర్‌, కరుణాకర్‌, ఆర్‌ఐలు కిరణ్‌కుమార్‌రెడ్డి, సైదులు, వేణు, ఎస్సైలు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజాపాలన కాదు.. రాచరిక పాలన

జగిత్యాల: రాష్ట్రంలో ప్రజాపాలన కాదు.. రాచరిక పాలన నడుస్తోందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ వసంత అన్నారు. బుధవారం జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్‌ఎస్‌ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవి ష్కరించారు. తెలంగాణ ప్రజల పోరాట స్ఫూ ర్తికి రైతాంగ సాయుధ పోరాటం ఉదాహరణ అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో సుపరిపాలన అందిస్తే.. రేవంత్‌రెడ్డి ప్రజావ్యతిరేక పాలన అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆనంద్‌రావు, గంగాధర్‌, మల్లేశ్‌, వొల్లం మల్లేశం, దే వేందర్‌నాయక్‌, వెంకటేశ్వర్‌రావు పాల్గొన్నారు.

ముగిసిన విశ్వకర్మ భగవానుడి బ్రహ్మోత్సవాలు

ధర్మపురి: పట్టణంలోని గోదావరి ఒడునున్న విశ్మకర్మ భగవానుడి బ్రహ్మోత్సవాలు బుధవారంతో ముగిశాయి. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో శ్రీమద్విరాట్‌ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ఐదు రోజులపాటు నిర్వహించారు. జయంతి వేడుకల సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హాజరై స్వామివార్లను దర్శించుకున్నారు. సాయంత్రం స్వామివారి సేవా పల్లకిని పట్టణ పురవీధుల మీదుగా ఊరేగించారు.

తాగునీటి కోసం గ్రామస్తుల ధర్నా

రాయికల్‌: పదిహేను రోజులుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం మండలంలోని వీరాపూర్‌ గ్రామస్తులు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పైప్‌లైన్‌ లీక్‌ కావడంతో నల్లా నీరు రావడం లేదని, పలుమార్లు పంచాయతీ కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవడం లేదని, ఉన్న బోరు కూడా వినియోగంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

మనుషుల అక్రమ రవాణా నిర్మూలన అందరి బాధ్యత

జగిత్యాల: మనుషుల అక్రమ రవాణా నిర్మూలన అందరి బాధ్యత అని ప్రజ్వల ఆర్గనైజేషన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ చంద్రయ్య అన్నారు. బుధవారం టీచర్స్‌ భవన్‌లో విద్య పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ చట్టాల గురించి వివరించాలని, పోక్సో, ఐటీపీఏ, బీఎన్‌ఎస్‌ చట్టాలపై విద్యార్థులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో కో–ఆర్డినేటర్‌ సత్యనారాయణ, చంద్రయ్య, సరిత, రాజేశ్‌, మహేశ్‌, ఆనందరెడ్డి పాల్గొన్నారు.

జాతి సమైక్యతతో  ముందుకు సాగాలి1
1/4

జాతి సమైక్యతతో ముందుకు సాగాలి

జాతి సమైక్యతతో  ముందుకు సాగాలి2
2/4

జాతి సమైక్యతతో ముందుకు సాగాలి

జాతి సమైక్యతతో  ముందుకు సాగాలి3
3/4

జాతి సమైక్యతతో ముందుకు సాగాలి

జాతి సమైక్యతతో  ముందుకు సాగాలి4
4/4

జాతి సమైక్యతతో ముందుకు సాగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement