
కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారని..
జగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు తన కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారని, భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నానని, తనకు సంరక్షణ కల్పించాలని సంక్షేమాధికారి కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కిష్టమ్మను మూడు రోజుల క్రితం కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారు. విద్యానగర్‌లోని రామాలయం వద్ద కాలం వెళ్లదీస్తోంది. స్థానికులు ఆమె పరిస్థితిని సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సఖీ కేంద్రం నిర్వాహకులు ఆమెను గురువారం సాయంత్రం చేరదీసి కౌన్సెలింగ్ నిర్వహించారు. తన పేరున ఉన్న ఇల్లును కొడుకు పేరిట చేసుకుని ఇప్పుడు పోషించడం లేదని అధికారులకు వివరించింది.