
జాతీయపోటీలకు నవోదయ విద్యార్థులు
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రీజియన్ పోటీలలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఏపీలోని ఒంగోలులో జరిగిన రీజనల్ లెవల్ కళా ఉత్సవ్–2025 పోటీల్లో విద్యాలయం నుంచి పాల్గొన్న గురునాథం వంశీ, ఎం.కార్తికేయ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో ఢిల్లీలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు. టాయ్స్ తయారీలో చూపిన ప్రతిభతో మొదటిస్థానంలో నిలిచారు. విద్యార్థులతో పాటు ఆర్ట్ టీచర్ గోకా నాగేశ్వర్‌రావును ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కె.బ్రహ్మానందరెడ్డి, రాయుడు అభినందించారు.