
సహకార సంఘాలకు ఉజ్వల భవిష్యత్
జగిత్యాలఅగ్రికల్చర్: సహకార సంఘాలకు ఉజ్వల భవిష్యత్ ఉందని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా సహకార అభివృద్ధి మండలి సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా పూర్తిగా వ్యవసాయాధారితం కావడంతో సహకార సంఘాలు రైతులకు అవసరమైన అనేక వ్యాపారాలు చేసుకునే వీలు కల్పిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొస్తున్న నేపథ్యంలో సహకార సంఘాలు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ మాట్లాడుతూ.. కొత్త సహకార సంఘాలను ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఎఫ్‌సీఐ మేనేజర్ రవిప్రకాశ్, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, కరీంనగర్ సహకార బ్యాంక్ సీఈవో సత్యనారాయణరావు, డీఏవో భాస్కర్, పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్ పాల్గొన్నారు.