వినూత్నం.. విజ్ఞానం | - | Sakshi
Sakshi News home page

వినూత్నం.. విజ్ఞానం

Sep 5 2025 5:36 AM | Updated on Sep 5 2025 5:36 AM

వినూత

వినూత్నం.. విజ్ఞానం

నిత్య విద్యార్థిగా.. సౌకర్యాలు కల్పిస్తూ..

పాఠ్యపుస్తకాల్లోని సిలబస్‌ పూర్తి చేయడమే పరమావధిగా పనిచేస్తున్న నేటి కాలంలో కొందరు ఉపాధ్యాయులు వినూత్న రీతిలో విద్యాబోధన చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయగా.. ఇంకొందరు నిరుద్యోగులకు అండగా ఉంటూ ఉద్యోగాన్వేషణలో బాసటగా నిలుస్తున్నారు.. పలువురు విద్యాభ్యాసం వయసుతో కూడినది కాదని నిత్య విద్యార్థిగా అభ్యసన చేయాలంటూ ముందుకెళ్తున్నారు.. మరికొందరు విద్యార్థుల్లో సామాజిక సేవ దృక్పథం నింపేందుకు తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు.. శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కథనాలు..

తాను పనిచేసే బడిలో సౌకర్యాల కల్పనకు ప్రయత్నిస్తూనే నిత్య విద్యార్థిగా వందల సంఖ్యలో ఆన్‌లైన్‌ కోర్సులు చేస్తూ ముందుకెళ్తున్నారు సిరిసిల్ల పట్టణం శివనగర్‌ కుసుమరామయ్య జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఇంగ్లిష్‌ టీచర్‌ పాతూరి మహేందర్‌రెడ్డి. 1996లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన పాతూరి పని చేసిన ప్రతీ స్కూల్‌లో అంకితభావంతో విద్యార్థుల సంఖ్య పెంచారు. పదో తరగతిలో ప్రతిభచాటిన విద్యార్థులకు తన తండ్రి పేరిట గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌ అందించారు. విద్యార్థుల్లో మానవతా విలువలు, మంచి లక్షణాలను పెంపొందించే ఉద్దేశంతో పాఠశాలల్లో నిజాయితి దుకాణం, మానవత్వపు గోడ, పెన్‌ బ్యాంకులను ప్రవేశపెట్టి పిల్లలను ప్రోత్సహించారు. మానవతా సేవలు అందిస్తున్న మహేందర్‌రెడ్డి ఇప్పటికే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కాగా, రెండురోజుల క్రితం తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ ఉపాధ్యాయ కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు. జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఏ వయసులోనైనా చదువుకోవచ్చని పేర్కొన్నారు.

సిరిసిల్లఎడ్యుకేషన్‌: పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచుతూ, సౌకర్యాలు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు హెచ్‌ఎం చకినాల శ్రీనివాస్‌. సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంగా 2018లో విధుల్లో చేరారు. అప్పుడు ఉన్న విద్యార్థులు 31 మంది కాగా ప్రస్తుతం 306కు చేరింది. రెండేళ్లుగా పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. పాఠశాలలో వసతుల కల్పనకు పూర్వ విద్యార్థులతో చర్చించి కంప్యూటర్‌ ల్యాబ్‌, గ్రంథాలయం, సీసీ కెమెరాలు, వాటర్‌ ఫిల్టర్‌ ఏర్పాటుకు కృషి చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం పలువరికి సైకిళ్లు అందజేశారు. విద్యార్థులను తమ బడికి రప్పించేలా వేసవి సెలవుల్లో ఉచిత కంప్యూటర్‌ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి మన్ననలు పొందారు. 2022లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. విద్యార్థుల ప్రవేశాలను గణనీయంగా పెంచి, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న గణాంకాల ప్రాతిపదికన కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా ప్రత్యేక చొరవతో ఈ ఏడాది జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని చేసుకుంటూ పోతే అవార్డులు రివార్డులు వస్తుంటాయని, విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించేందుకు మద్రాస్‌ ఐఐటీతో అవకాశాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు.

వినూత్నం.. విజ్ఞానం1
1/1

వినూత్నం.. విజ్ఞానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement