
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలతో..
క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా వట్టెంల జెడ్పీ స్కూల్ గెజిటెడ్ హెచ్‌ఎం కడార్ల సూర్యనారాయణ కృషి చేస్తున్నారు. బడిబాటలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోను ప్రచారం చేసి ఆకర్షణగా నిలిచారు. ప్రభుత్వ నిర్ణయానికి ముందే పాఠశాలను ఆంగ్ల మాధ్యమ స్కూల్‌గా మార్చి ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభించారు. సిరిసిల్ల టీచర్ వెబ్‌సైట్ ద్వారా హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు ఉపయుక్తమైన సమాచారం అందిస్తున్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు, అంతర్జాతీయంగా గ్లోబల్ టీచర్ అవార్డు అందుకున్నారు.