
‘ఇగురం’గా బోధిస్తూ..
మండలంలో సెకండరీ గ్రేడ్ టీచరుగా పనిచేస్తున్న కపిల నరేశ్ విద్య బోధన చేస్తూనే, నిరుద్యోగులకు అండగా ఉండి, పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు అవసరమైన మెలకువలను ‘ఇగురుం’ యూట్యూబ్ చానల్‌లో అందిస్తున్నారు. ప్రస్తుతం చందుర్తి మండలంలో పోస్టింగ్ రావడంతో తన కూతురును అదే పాఠశాలలో చదివించేందుకు ప్రవేశం తీసుకుని ఆదర్శంగా నిలిచారు. తన జీవన గమనానికి ఆర్థిక వనరులు అందిస్తున్న ప్రభుత్వ బడిని దక్కించుకునేందుకు తన కూతురిని ప్రభుత్వ బడిలో చేర్పించినట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా విద్యాశాఖ నుంచి అవకాశాలు రానప్పటికీ వివిధ సంస్థలు 2 రాష్ట్రస్థాయి అవార్డులతో పాటు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి.