
కుటుంబాన్ని ఆదుకోండి
నా భర్త రేవల్ల రవీందర్‌గౌడ్ ఉపాధి కోసం ఇజ్రాయిల్ దేశం వెళ్లాడు. అనా రోగ్యంతో బాధపడుతు న్న ఆయనను ఇటీవల జరిగిన ఇజ్రాయిల్, ఇరా న్ యుద్ధం సందర్బంగా బంకర్‌లో ఉంచగా సరైన వైద్యం అందక అక్కడే చనిపోయాడు. అప్పులు, పేదరికంతో ఉన్న మా కుటుంబం మరింత కష్టాల్లో పడింది. నా కొడుకు మంజునాథ్ దివ్యాంగుడు (చెవిటి, మూగ) కావడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. నా కుమారుడికి ఏదైనా ఉపాధి కల్పించండి.
– రేవెల్ల విజయలక్ష్మి, జగిత్యాల
ప్లాట్లకు హద్దులు చూపండి
2009లో ఇందిరమ్మ పథకం కింద కొడిమ్యాల శివారులోని సర్వేనంబర్ 411, 412లోగల భూమిని 193 ప్లాట్లుగా చేసి మాకు పట్టాలు ఇచ్చారు. ఇందులో 40ప్లాట్లకు హద్దులు చూపించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని అప్పటి కలెక్టర్‌ను సంప్రదించగా విచారణ జరిపి మా 40 ప్లాట్లతోపాటు మొత్తం 92 ప్లాట్లకు హద్దులు నిర్ణయించారు. ఆ స్థలంలో కొనుగోలు కేంద్రం నిర్వహించడంతో హద్దులు చెరిపివేయబడ్డాయి. తిరిగి హద్దులు ఏర్పాటు చేయించండి.
– కొడిమ్యాల ప్రజలు
పరిహారం ఇప్పించండి
మాది కొడిమ్యాల మండలం పూడూరు. మా గ్రామం మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి 563 భూసేకరణలో నష్టపోయిన గౌరాపూర్, నాచుపల్లి, నూకపల్లి, రాజారం, పోతారం గ్రామాల ప్రజలకు పరిహారం మంజూరు చేశారు. పూడూరు బాధితులకు పరిహారం ఇప్పటికీ అందలేదు. జగిత్యాల ఆర్డీవోను సంప్రదిస్తే ఫైల్ నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఆ ఫైల్‌ను క్లియర్ చేసి పరిహారం ఇప్పించండి.
– వెల్ముల రాంరెడ్డి, పూడూరు
ఆస్తులు గుంజుకుని అనాథను చేశాడు
నా భర్త రామగిరి రాములు. మాకు సంతానం లేక ఆలూరుకు చెందిన సురతాని శంకర్‌రెడ్డిని దత్తత తీసుకున్నాం. నా భర్త 16ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటినుంచి శంకర్‌రెడ్డిని అన్నీ నేనై పెంచాను. నా భర్త పేరిట జగిత్యాల మండలం మోరపల్లిలో ఉన్న ఐదు గుంటల స్థలాన్ని శంకర్‌రెడ్డి నాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా నా పోషణతోపాటు అన్ని ఖర్చులు భరిస్తానని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదు. నా పోషణ భరించేలా చర్యలు తీసుకోండి. లేకుంటే నా ఆస్తి నాకు తిరిగి ఇప్పించి ఆదుకోండి.
– రామగిరి రాజేశ్వరి, ఆలూరు

కుటుంబాన్ని ఆదుకోండి

కుటుంబాన్ని ఆదుకోండి

కుటుంబాన్ని ఆదుకోండి