ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి

Jul 8 2025 5:14 AM | Updated on Jul 8 2025 5:14 AM

ప్రభు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి

జగిత్యాల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. 50శాతం కన్నా తక్కువగా ప్రసవాలు చేయించిన ఆస్పత్రులపై దృష్టి సారించి 90 శాతం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య చాలా తక్కువగా ఉందని, పనితీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. వచ్చే మూడు నెలల్లో కచ్చితంగా 90 శాతం పెరగాలని ఆదేశించారు. గర్భిణులను గుర్తించి వారికి మోటివేషన్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌, డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, జైపాల్‌రెడ్డి, రవీందర్‌ పాల్గొన్నారు.

బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు

జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

రేపు ‘దిశ’ కమిటీ సమావేశం

జగిత్యాల: జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్‌ కమిటీ (దిశ) సమావేశం కలెక్టరేట్‌లో ఈనెల 9న నిర్వహించనున్నట్లు గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరణ్‌ తెలిపారు. చైర్మన్‌, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ఉంటుందని, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు.

ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా అద్దంకి దయాకర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ నియమితులయ్యారు. గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు పార్టీని సంస్థాగతంగా పునర్నిర్మాణం చేయడంలో భాగంగా ఉమ్మడి జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జిలను నియమిస్తూ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు చెందిన బీసీ సంక్షమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మెదక్‌ ఉమ్మడి జిల్లాకు, రాష్ట్రసంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను వరంగల్‌ ఉమ్మడి జిల్లా పార్టీ ఇన్‌చార్జిగా నియమించారు.

మళ్లీ బీఆర్‌ఎస్‌దే అధికారం

కోరుట్ల: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. పట్టణంలోని బిలాల్‌పూర 21వ వార్డులో 100 మంది మైనార్టీలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంజయ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగరేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజేష్‌, మాజీ కౌన్సిలర్లు సజ్జు, సత్యం పాల్గొన్నారు. అంతకుముంద అల్లమయ్య గుట్ట వద్ద ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు.

విద్యార్థులకు ఇబ్బందులు రానీయొద్దు

మెట్‌పల్లిరూరల్‌: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌ అన్నారు. మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌ గురుకులాన్ని సోమవారం సందర్శించారు. పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, భోజనం పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని సూచించారు. సీజనల్‌ వ్యా ధులు ప్రబలే అవకాశం ఉండడంతో పరిసరాలను శుభ్రం చేయించాలన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో   ప్రసవాలు పెంచాలి1
1/3

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో   ప్రసవాలు పెంచాలి2
2/3

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో   ప్రసవాలు పెంచాలి3
3/3

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement