జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం సోమన్‌పల్లి రైతులకు విద్యుత్ కష్టాలు తీరాయి. ట్రాన్స్‌ఫార్మర్ లేకపోవడం.. స్తంభాలు లేకపోవడం.. విద్యుత్ వైర్లు లాగక పోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో ‘రైతులకు విద్యుత్ కష్టాలు’ శీర్షికన ‘సాక్షి’ ఈనెల 7న కథనం ప్రచురించింది. ఆ కథనానికి స్పందించిన ట్రాన్స్‌కో అధికారులు సోమన్‌పల్లిలోని మందోట వద్ద కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర క్రితం విద్యుత్ కనెక్షన్లు మంజూరు పొందిన రైతులకు కొత్త స్థంబాలు వేయించారు. విద్యుత్ వైర్లు లాగి రైతులకు విద్యుత్ సరఫరా చేశారు. లూజ్‌వైర్లను గుర్తించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి లైన్లను సవరించారు. దీంతో సోమన్‌పల్లి గ్రామ రైతులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.
రైతులకు తీరిన విద్యుత్ కష్టాలు
రైతులకు తీరిన విద్యుత్ కష్టాలు