
మారుమోగిన నృసింహుడి నామస్మరణ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయం నారసింహ నామస్మరణతో మారుమోగింది. ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు. ముందుగా గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
దాడి సరికాదు
కథలాపూర్: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి నాయకులు దాడి చేయడం దారుణమని మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మాట్లాడారు. జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓసీ కుటుంబానికి చెందిన కవిత బీసీల ఉద్యమంలో పాల్గొనడంలో అర్థం లేదన్నారు. రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న బీసీలు ఏకమైతే రాజకీయంగా దెబ్బతింటామనే భావనలో కవిత ఉన్నారన్నారు. ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరి సొంతమని, మల్లన్న కార్యాలయంపై దాడులకు పాల్పడటం జాగృతి నాయకులకు తగదన్నారు.
‘కోట’కు నివాళి
ఇబ్రహీంపట్నం: పద్మశ్రీ అవార్డు గ్రహీత విలక్షణ నటుడు మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాస్‌రావు మృతి చెందడంతో ఆదివారం మండలంలోని వేములకుర్తిలో సినీ ఆర్టిస్ట్‌లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సినీ ఆర్టిస్టులు భరత్‌కుమార్, రమేశ్, ప్రభాకర్, ఇంద్రయ్య, సురేందర్, రాజేశ్, కై లాశ్ పాల్గొన్నారు.
దేశ ప్రజలకు అంబేడ్కర్ ఆరాధ్యనీయుడు
జగిత్యాలటౌన్: ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో జీవించడానికి కారణమైన అంబేడ్కర్ దేశ ప్రజలందరికీ ఆరాధ్యనీయుడయ్యారని ద్యావర సంజీవరాజు అన్నారు. ప్రతీ ఆదివారం అంబేడ్కర్ స్మరణలో భాగంగా ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (డిక్కీ)ఆధ్వర్యంలో జగిత్యాల తహసీల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ను ప్రతినిత్యం స్మరించుకోవడం మనందరికి దక్కిన గొప్ప అదృష్టమన్నారు. ప్రజలందరికి సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలు, రాజ్యాంగాన్ని సైతం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కేవలం ఆదివారమే కాదు ప్రతి రోజు అంబేడ్కర్‌ను స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిక్కీ జిల్లా అధ్యక్షుడు నల్ల శ్యాం, రవీందర్‌రావు, అనంతుల కాంతారావు, పులి నర్సయ్య, మద్దెల నారాయణ,పల్లె రవి, అంబేడ్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
నేడు వైస్ చాన్స్‌లర్ రాక
జగిత్యాలఅగ్రికల్చర్: మండలంలోని పొలాస వ్యవసాయ కళాశాలకు సోమవారం వ్యవసాయ వర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ అల్దాస్ జానయ్య రానున్నారు. కోరుట్లలో వ్యవసాయ విద్య విద్యార్థులను పొలాస వ్యవసాయ కళాశాలకు బదిలీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, వ్యవసాయ వర్శిటీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ కె.ఝన్సీరాణి, వ్యవసాయ వర్శిటీ డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొననున్నారు.

మారుమోగిన నృసింహుడి నామస్మరణ

మారుమోగిన నృసింహుడి నామస్మరణ