
తాతాల నుంచి ఇక్కడే ఉంటున్నాం
తాతలకాలంగా ఇక్కడే ఉంటున్నాం. వర్షకాలంలో బిక్కుబిక్కుమంటు గడుపుతున్నాం. వేసవిలో అగ్ని ప్రమాదాలతో గుడిసెలు కాలిపోయి సర్వస్వం కోల్పోయాం. నాలాగా చాలామంది గూడెంలో ఉన్నారు. ఇళ్లు నిర్మించుకునే అవకాశం ఇవ్వాలి.
– పెరుమళ్ల మల్లవ్వ, నాయికపుగూడెం
ఉన్నతాధికారుల
దృష్టికి తీసుకెళ్లాం
ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించాం. ఎల్–1 ఫాం నింపడానికి ఫొటోల కోసం వెళ్తే అటవీ శాఖ అధికారులు రిజర్వ్ ఫారెస్టుగా పేర్కొనడంతో ముందుకు వెళ్లలేకపోతున్నాం. వారికి ఎలా న్యాయం చేయాలనే దానిపై కలెక్టర్ పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు నడుచుకుంటాం. – లచ్చాలు, ఎంపీడీవో