
అరుణాచలానికి ఆర్టీసీ బస్సు
కోరుట్ల ఆర్టీసీ డిపోలో ప్రారంభించిన బస్సు
కోరుట్ల: తమిళనాడులోని అరుణాచలం దర్శనానికి వెళ్లేందుకు భక్తుల కోసం ఆర్టీసీ కోరుట్ల డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించారు. ఈ బస్సు మంగళవారం కోరుట్ల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి కరీంనగర్, హైదరాబాద్, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా పదో తేదీన అరుణాచలం చేరుకుంటుందని డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. అదేరోజు తిరుగు ప్రయాణమై జోగులాంబ అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి కోరుట్లకు చేరుకుంటుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.5వేలు, పిల్లలకు రూ. 3,800 ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నృసింహుడి సన్నిధిలో మంత్రి అడ్లూరి పూజలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆలయం పక్షాన ట్రస్టుబోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులున్నారు.
శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో తులసి అర్చన
మల్యాల: తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మండలంలోని లంబాడిపల్లిలోగల శ్రీపద్మావతి సహిత ప్రసన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో కోటి తులసి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులకు మరాటి సత్తయ్య, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా మహాలక్ష్మి బోనాలు
కోరుట్లరూరల్: మండలంలోని చిన్నమెట్‌పల్లి గ్రామంలో ఆదివారం మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. డప్పుచప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వీడీసీ చైర్మన్ నాగులపెల్లి జైరెడ్డి, వైస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సంగెపు అశోక్, సభ్యులు పాల్గొన్నారు.

అరుణాచలానికి ఆర్టీసీ బస్సు

అరుణాచలానికి ఆర్టీసీ బస్సు

అరుణాచలానికి ఆర్టీసీ బస్సు