సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే | - | Sakshi
Sakshi News home page

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే

Mar 22 2025 1:57 AM | Updated on Mar 22 2025 1:52 AM

జగిత్యాల: జిల్లాకేంద్రం.. లక్షకు పైగా జనాభా. పది ప్రధాన కూడళ్లున్నాయి. ప్రతిరోజూ వివిధ పనులు నిమిత్తం జిల్లా కేంద్రానికి అనేకమంది వస్తుంటారు. ఇతర జిల్లాల నుంచి వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం ద్విచక్రవాహనాలు, కార్లు, ఇతరత్రా వాహనాలపై వస్తుంటారు. ఈ క్రమంలో వారంతా ట్రాఫిక్‌ సమస్యను ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌ పక్కన జనరల్‌ ఆస్పత్రి ఉండటంతో రద్దీ అధికంగా ఉంటుంది. ఇక్కడి ఇందిరమ్మ చౌరస్తాలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేసినా కొద్దికాలంగా పనిచేయడం లేదు. ఇక్కడ ట్రాఫిక్‌ సిబ్బంది ఉండడం లేదు. జిల్లా కేంద్రంలోని మరో ప్రధానమైన ప్రాంతం కొత్తబస్టాండ్‌. ఇక్కడా సిగ్నల్స్‌ సరిగా పనిచేయడం లేదు. ఫలితంగా ట్రాఫిక్‌ నిత్యం నిలిచిపోతోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసినప్పటికీ అవి పనిచేయడం లేదు. జిల్లా కేంద్రంలోని తహసీల్‌ చౌరస్తా, బైపాస్‌ చౌరస్తా సమీపంలోని సిగ్నల్స్‌ పనిచేయడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సిగ్నల్స్‌ వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో ప్రధాన మున్సిపాలిటీలైన కోరుట్ల, మెట్‌పల్లిలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉన్నప్పటికీ సరిగా పనిచేయడం లేదు. కోరుట్ల మీదుగా వెళ్లే ఎన్‌హెచ్‌–63 హైవేపై ట్రాఫిక్‌ విపరీతంగా ఉంటుంది.

● ఇది జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్‌ చౌరస్తా. ఇక్కడ సిగ్నల్స్‌ కొద్దిరోజులు పనిచేస్తే మరికొద్ది రోజులు పనిచేయవు. ఇక్కడి కొత్తబస్టాండ్‌కు నిత్యం అనేక బస్సులు వస్తుంటాయి. పెట్రోల్‌ బంక్‌లు ఉండటంతో అత్యంత రద్దీగా ఉంటుంది. సిగ్నల్‌ వ్యవస్థ పనిచేయక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రెడ్‌లైట్‌ 60 సెకన్లు పడితే.. గ్రీన్‌లైట్‌ 30 సెకన్లు మాత్రమే పడుతుండడం ఇబ్బందిగా మారుతోంది. సిగ్నల్స్‌ను సరిచేయాల్సిన అవసరం ఉంది.

● ఇది జిల్లాకేంద్రంలోని తెలంగాణ వైన్స్‌, పొన్నాల గార్డెన్స్‌కు వెళ్లే చౌరస్తాలో ఉన్న ట్రాఫిక్‌ సిగ్నల్‌. ఇది కొన్నాళ్లుగా పనిచేయడం లేదు. కనీసం వాటిని పట్టించుకునేనాథుడే కరువయ్యా రు. అధికారులు వాటిని విని యోగంలోకి తెచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఎప్పుడు పనిచేస్తాయో ఎవరికీ తెలియని వైనం కొన్నిసార్లు సిగ్నల్స్‌.. రోజుల తరబడి మూలకు బల్దియాల్లో అస్తవ్యస్తంగా మారుతున్న ట్రాఫిక్‌ నిత్యం ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు

సిగ్నల్స్‌ వినియోగంలోకి తేవాలి

జిల్లా కేంద్రం కావడంతో ట్రాఫిక్‌ వ్యవస్థ అస్థవ్యస్తంగా మారింది. సిగ్నల్స్‌ ఏర్పాటు చేసినప్పటికీ సక్రమంగా పనిచేయడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్స్‌ వినియోగంలోకి వచ్చేలా చూడాలి.

– ఒడ్నాల రాజశేఖర్‌, జగిత్యాల

టైమ్‌ ప్రకారం రావడంలేదు

జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్స్‌ సక్రమంగా లేవు. టైమింగ్‌ ప్రకారం రావడం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకవేళ సిగ్నల్స్‌ పడినప్పుడు ఆగితే తర్వాత మళ్లీ వెంటనే రెడ్‌లైట్‌ పడుతోంది. అధికారులు కరెక్ట్‌ టైమింగ్‌ సెట్‌ చేయాలి.

– కృష్ణ, జగిత్యాల

అస్తవ్యస్తంగా ట్రాఫిక్‌

కోరుట్లలో ట్రాఫిక్‌ విపరీతంగా పెరుగుతోంది. ఎహెచ్‌–63 హైవే ఉండడంతో భారీ వాహనాలు వస్తున్నాయి. కొ ద్ది నెలలుగా సిగ్నల్స్‌ పనిచేయడం లేదు. రోడ్డు ప్ర మాదాలు జరిగే అవకాశాలున్నాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – నరేశ్‌, కోరుట్ల

ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్‌ ప్రాంతం. ఇక్కడ ఏర్పాటు చేసిన

ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఎప్పుడో ఒకసారి పనిచేస్తాయి. పూర్తిస్థాయిలో పనిచేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఇది ప్రధాన చౌరస్తా కావడం.. ధర్మపురికి వెళ్లే దారి కావడంతో రద్దీ ఉంటోంది. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేసినా అవి పనిచేయడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని పరిస్థితి.

ఇది జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్‌గల పొన్నాల గార్డెన్స్‌, కరీంనగర్‌ రోడ్‌కు వెళ్లే చౌరస్తా. నిత్యం భారీ వాహనాలు వెళ్తుంటాయి. కొత్తగా సిగ్నల్స్‌ ఏర్పాటు చేసినప్పుడు పనిచేశాయంటే ఇప్పటివరకు పనిచేసిన దాఖలాలు లేవు.

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే1
1/7

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే2
2/7

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే3
3/7

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే4
4/7

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే5
5/7

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే6
6/7

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే7
7/7

సిగ్నల్స్‌.. ఉన్నా లేనట్టే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement