మూడు గ్రామాలకో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ | - | Sakshi
Sakshi News home page

మూడు గ్రామాలకో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌

Mar 17 2025 10:19 AM | Updated on Mar 17 2025 11:09 AM

● వినియోగదారుల విద్యుత్‌ కష్టాలకు చెక్‌ ● లో–వోల్టేజీ లేకుండా విద్యుత్‌శాఖ ఏర్పాట్లు

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో వ్యవసాయం, గృహ, పరిశ్రమల అవసరాలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫ రా చేయడంతో పాటు విద్యుత్‌ లాస్‌ను వీలైనంత మేరకు తగ్గించడమే లక్ష్యంగా విద్యుత్‌ శాఖ ముందుకెళ్తోంది. విద్యుత్‌ సరఫరాలో ఎప్పటికప్పుడు నష్టాన్ని నివారించడం, ఓవర్‌ లోడ్‌ను తగ్గించడం, లో– వోల్టో జీ సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మూడు గ్రామాలకో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసింది.

జిల్లాలో 117 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విద్యుత్‌ శాఖ ఎక్కడికక్కడే విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఒక్కో సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి రూ.1.50 కోట్ల నుంచి రూ.1.75 కోట్ల వరకు వెచ్చిస్తోంది. ప్రస్తుతం గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తుండటంతో పంపిణీలో ఇ బ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటోంది. వి ద్యుత్‌ సరఫరాలో సబ్‌స్టేషన్‌లే కీలకం కావడంతో వాటి నిర్మాణానికి నిర్ణయించింది. జిల్లాలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లు 117 పనిచేస్తున్నాయి. ప్ర స్తు తం జగిత్యాల అర్బన్‌ మండలంలో 7, జగిత్యాల రూరల్‌లో 7, రాయికల్‌లో 6, సారంగాపూర్‌లో 3, బీర్‌పూర్‌లో 3, ధర్మపురిలో 4, బుగ్గారంలో 3, వెల్గ టూర్‌లో 4, ఎండపల్లిలో 4, పెగడపల్లిలో 6, గొల్లపల్లిలో 5, మల్యాలలో 7, కొడిమ్యాలలో 5, కోరుట్ల లో 11, మెట్‌పల్లిలో 10, ఇబ్రహీంపట్నంలో 8, మ ల్లాపూర్‌లో 8, కథలాపూర్‌లో 7, మేడిపల్లిలో 3, భీమారంలో 6 విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలో దాదాపు 360 గ్రామాల వరకు ఉన్నాయి. దాదాపు మూడు గ్రామాలకో విద్యుత్‌ సబ్‌స్టేషన్లు పనిచేస్తున్నాయి.

ఎనిమిది 132/33 కేవీ సబ్‌స్టేషన్లు

జిల్లాలో ఎనిమిది 132/33 కేవీ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. జిల్లాకేంద్రంతో పాటు ధర్మపురి, రాయికల్‌, కోరుట్ల, కథలాపూర్‌ మండలకేంద్రాలతో పాటు, కొడిమ్యాల మండలం పూడూరు, మెట్‌పల్లి మండలం గోధూర్‌, వెల్గటూర్‌ మండలం ఎండపల్లిలో ఉన్నాయి. సారంగాపూర్‌ మండలంలోని పెంబట్ల–కోనాపూర్‌లో 220/132 కేవీ సబ్‌స్టేషన్‌ ఉంది.

విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నుంచి ఇంటి వరకు..

మొదట జిల్లాలోని పెంబట్ల–కోనాపూర్‌లో గల 220/132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు రామగుండం థర్మల్‌ స్టేషన్‌ నుంచి.. అక్కడి నుంచి జిల్లాలోని ఎనిమిది 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు.. అక్కడి నుంచి 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ సరఫరా అవుతుంది. 33/11 కేవీ సబ్‌స్టేషన్ల కింద 11 కేవీ లైన్స్‌కు సంబంధించి 520 ఫీడర్లు ఉంటాయి. ఈ ఫీడర్ల ద్వారా గ్రామాల్లోని డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్లర్లకు చేరుతుంది. ఇలాంటివి జిల్లాలో 22,884 వరకు ఉంటాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ల కింద 41 వేల ఎల్‌టీ ఫీడర్‌లు ఉంటాయి. ఇక్కడి నుంచి గృహాలు, వ్యవసాయ బావులకు విద్యుత్‌ సరఫరా అవుతుంది. ఇలా నిత్యం జిల్లాలో 4 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు.

సబ్‌స్టేషన్ల పరిశీలనకు 255 మంది

విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో విద్యుత్‌ సరఫరాను చూసేందుకు 255 మంది పనిచేస్తున్నారు. ఇందులో 225 మంది ఆపరేటర్లు, 30 మంది వాచ్‌మెన్‌లు. వీరితోపాటు ఎప్పటికప్పుడు విద్యుత్‌ పంపిణీ సంస్థకు చెందిన ఎస్‌ఈ, డీఈ, ఏడీ, ఏఈ, లైన్‌మన్‌, హెల్పర్లు కూడా పరిశీలిస్తుంటారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్లు అత్యధిక సంఖ్యలో ఏర్పాటు కావడంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలగడం లేదు.

ప్రస్తుతం ఇబ్బంది లేదు

ప్రస్తుతం విద్యుత్‌ సరఫరా లో ఇబ్బంది లేదు. నాణ్య మైన కరెంట్‌ వస్తోంది. లో–వోల్టేజీ సమస్యతో వి ద్యుత్‌ మోటర్లు కాలిపోతాయనే బాధ కూడా లేదు. ఏదైనా సమస్యతో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పుడు కొంత ఇబ్బంది ఎదురవుతున్నా.. ఒక్కరోజులోనే మరో ట్రాన్స్‌ఫార్మర్‌ బిగిస్తున్నారు.

– నక్కల తిరుపతిరెడ్డి,

తొంబరావుపేట, మేడిపల్లి(మం)

నాణ్యమైన 24 గంటల విద్యుత్‌

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం అవసరమైనన్ని సబ్‌స్టేషన్లు నిర్మించాం. విద్యుత్‌ నష్టాలను వీలైనంత వరకు తగ్గించి.. 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాం. విద్యుత్‌ సమస్యల పరిస్కారం కోసం జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తున్నాం.

– సాలియా నాయక్‌, ఎస్‌ఈ

మూడు గ్రామాలకో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌1
1/2

మూడు గ్రామాలకో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌

మూడు గ్రామాలకో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌2
2/2

మూడు గ్రామాలకో విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement