సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూచాళ్లు ఎత్తుకుపోతుంటారు. కానీ అన్నీ తెలిసిన యువతకు కొలువుల గాలమేసి విదేశీ కంపెనీలకు విక్రయిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మనుషులను సంతలో పశువుల్లా విక్రయించే వారి విషయంలో తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాలని భా | - | Sakshi
Sakshi News home page

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూచాళ్లు ఎత్తుకుపోతుంటారు. కానీ అన్నీ తెలిసిన యువతకు కొలువుల గాలమేసి విదేశీ కంపెనీలకు విక్రయిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మనుషులను సంతలో పశువుల్లా విక్రయించే వారి విషయంలో తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాలని భా

Mar 16 2025 12:28 AM | Updated on Mar 16 2025 12:26 AM

తమను భారత్‌కు పంపాలని మయన్మార్‌లో యువకుల నిరసన (ఫైల్‌)

కరీంనగర్‌ పోలీసుల లుక్‌అవుట్‌ నోటీసులు

జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామరావు రాజశేఖర్‌ వయసు 25ఏళ్లలోపే. కానీ బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. అతను ఇప్పటి వరకూ వివిధ సైబర్‌ ఫ్రాడ్‌ కంపెనీలకు దాదాపు 300 మందికి పైగా యువతను విక్రయించాడు. జగి త్యాల జిల్లా రాయికల్‌కు చెందిన నలుగురిని ఇదేవిధంగా లావోస్‌ తరలించి వేధిస్తే వారు ఎలాగోలా ఇండియాకు వచ్చి రాజశేఖర్‌పై ఫిర్యాదు చేయగా.. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసి లుక్‌అవుట్‌ నోటీసు జారీచేసింది. గతేడాది సిద్దిపేటలోనూ రాజశేఖర్‌పై ఇదే తర హ కేసు నమోదైంది. ఫిబ్రవరి 22న కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం రంగపేటకు చెందిన కొక్కిరాల మధుకర్‌రెడ్డిని ఇదే తరహాలో మోసగించిన విషయంలో మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు కరీంనగర్‌ పోలీసులు రాజశేఖర్‌పై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.

యువత అప్రమత్తంగా ఉండాలి

కొలువుల కోసం విదేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. కంపెనీ వివరాలు, వీసా, నియామక పత్రాలు క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. ఇందుకోసం విదేశాంగశాఖ వెబ్‌సైట్‌ లేదా ఆయా దేశాల భారత దౌత్యకార్యాలయాల వెబ్‌సైట్లను సంప్రదించండి. ఆపద వస్తే ఆదుకునేందుకు కేంద్రం ఉంది. కానీ, ఆ ఆపద రావడం కన్నా.. ముందే అప్రమత్తంగా ఉండడం మంచిది.

– బండి సంజయ్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి

ఎలా తరలిస్తారు?

గుజరాత్‌ పోరుబందర్‌కు చెందిన హితేశ్‌, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన రాజశేఖర్‌ ఈ మానవ అక్రమ రవాణాలో కింగ్‌పిన్‌లని పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. మార్చి 10, 11 తేదీల్లో బాధితులను మయన్మార్‌లోని మైవాడీ జిల్లా నుంచి థాయ్‌లాండ్‌లోని మైసోట్‌ నగరానికి, ఆ పై మన దేశ రాజధాని ఢిల్లీకి తరలించాయి. అక్కడ నుంచి వచ్చిన బాధితుల ద్వారా సీబీఐ, ఎన్‌ఐఏ, రాష్ట్రానికి చెందిన సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ)లు మోసం ఎలా జరిగిందో వివరాలు రాబట్టాయి. ఆయా ఏజెన్సీలకు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల్లో కొలువుల కోసం చూస్తున్న అమాయకులకు తొలుత టెలీగ్రామ్‌ యాప్‌లో లింకులు పంపుతారు. అనంతరం వీరికి జూమ్‌ యాప్‌ ద్వారా ఇంటర్వ్యూ, టైపింగ్‌ స్పీడ్‌ పరీక్షించి ఎంపిక చేస్తారు. వీరినుంచి రూ.3లక్షల వరకు ఉద్యోగం ఇచ్చినందుకు వసూలు చేస్తారు. ఇవ్వని వారినీ ఏమీ అనకుండా ఉచితంగా విమాన టికెట్‌ పంపుతారు. తీరా థాయ్‌లాండ్‌ వెళ్లాక..అక్కడ అవసరాన్ని బట్టి.. మయన్మార్‌, థాయ్‌లాండ్‌, లావోస్‌లకు సరఫరా చేస్తారు. పాస్‌పోర్టు లాక్కుని సైబర్‌ నేరాలు చేయాలని చిత్రహింసలకు గురిచేస్తారు.

సూత్రధారుల్లో ఉమ్మడి జిల్లావారు..

ఈ కేసులో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామారావు రాజశేఖర్‌తోపాటు మరో ముగ్గురు ట్రాఫికింగ్‌లో ఇన్వాల్వ్‌ అయ్యారని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో శుక్రవారం మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. వీరిలో జగిత్యాలకు చెందిన అల్లెపు వెంకటేశ్‌, చల్లా మహేశ్‌, వేములవాడకు చెందిన కట్టంగూరి సాయికిరణ్‌ ఉన్నారు. మరో ఐదుగురు హైదరాబాద్‌కు చెందిన బషీర్‌ అహ్మద్‌, గాజుల అభిషేక్‌, ఎండీ జలాల్‌, బొమ్మ వసంత్‌కుమార్‌, దాసరి ఏక్‌నాథ్‌గౌడ్‌గా పోలీసులు తెలిపారు. మధుకర్‌రెడ్డి తరహాలో వందలాది మంది అమాయక యువకులను మయన్మార్‌లో బంధించారని ‘సాక్షి’ వరుస కథనాలతో కదిలిన కేంద్రం రెండు విమానాలతో మొత్తం 540 మందిని రక్షించి, సురక్షితంగా ఇండియాకు తరలించింది. ఈ క్రమంలో తమ పిల్లలను కేంద్రం సురక్షితంగా ఇంటికి తీసుకురావడంపై బాధిత కుటుంబాలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూ1
1/3

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూ

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూ2
2/3

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూ

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూ3
3/3

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement