చెత్త సేకరణలో నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

చెత్త సేకరణలో నిర్లక్ష్యం

Mar 14 2025 1:51 AM | Updated on Mar 14 2025 1:46 AM

రోడ్లపై పేరుకుపోతున్న చెత్తాచెదారం పరిసరాల్లో వెదజల్లుతున్న దుర్వాసన ప్రధానచోట్లలో కనిపించని డంపర్‌బిన్స్‌

ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్‌లోది. ఇక్కడ కొద్దిరోజులుగా డంపర్‌బిన్‌ ఉండేది. ఇప్పుడు లేకపోవడంతో చెత్తనంతా రోడ్డుపైనే పడేస్తున్నారు. కొద్దిరోజులుగా అక్కడ చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. ఆ మార్గంమీదుగా స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు, ప్రజలు దుర్వాసన భరించలేకపోతున్నారు.

ఇది జిల్లాకేంద్రంలోని రామాలయం సమీపంలో ఉన్న డ్రైనేజీ. సమీప ప్రజలు చెత్తను ఇక్కడే పడేస్తున్నారు. ఫలితంగా డ్రైనేజీ నిండిపోయింది. రోడ్డంతా ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు, పాడైన ఫ్యాన్లు, కూలర్లు, పరుపులతో కనిపిస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

జగిత్యాల: జిల్లాలోని మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ సక్రమంగా సాగడం లేదనడానికి ఈ చిత్రాలే ఉదాహరణ. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో డంపర్‌బిన్స్‌ను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఎక్కడబడితే అక్కడే చెత్త పడేస్తున్నారు. దీంతో దుర్గంధం వెదజల్లుతోంది. వాస్తవానికి ఆలయాలు, ఆస్పత్రుల సమీపాల్లో డంపర్‌బిన్స్‌ను ఎక్కువగా ఏర్పాటు చేయాలి. కానీ.. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. రోడ్లపై చెత్త వెంటనే తీస్తే ఇబ్బంది ఉండదు. చెత్త సేకరణలో మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోతోంది. పందులు, ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. జగిత్యాల మున్సిపాలిటీలో డంపర్‌ఫేసర్‌ వాహనం మరమ్మతు చేసినా డంపర్‌బిన్స్‌ అత్యధికంగా లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. డంపర్‌బిన్స్‌ అత్యధికంగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇది కోరుట్లలోని అయిలాపూర్‌ నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి వెళ్లే దారి. చెత్తను ఈ రోడ్డుపై పోయడంతో పెంట కుప్పలాగా మారింది. బల్దియా అధికారులు స్పందించకపోవడంతో ఆలయానికి వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఇది ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న గోదావరికి వెళ్లే రహదారి. డంపింగ్‌యార్డు లేక పట్టణంలోని చెత్తనంతా తీసుకువచ్చి రోడ్డు వెంట పోస్తున్నారు. భక్తులు అటువైపు వెళ్లలేకపోతున్నారు. స్థానికులు దుర్గంధాన్ని భరించలేకపోతున్నారు.

ఇది జిల్లాకేంద్రంలోని శ్మశాన వాటిక ప్రాంతంలోగల బైపాస్‌రోడ్‌. ఇక్కడ పెద్ద డ్రైనేజీ ఉంది. చెత్త వేసేందుకు డంపర్‌బిన్‌ లేక వ్యర్థాలను పడేస్తున్నారు. చెత్త తొలగించేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

ఇది మెట్‌పల్లిలోని 12వ వార్డు కాలనీ. ఇక్కడ ప్రజల కోసం డంపర్‌బిన్స్‌ ఏర్పాటు చేయకపోవడంతో చెత్తను ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు. కాలనీ అంతా దుర్గంధం వెదజల్లుతోంది.

ఇది రాయికల్‌ మున్సిపాలిటీలోని అశోక్‌నగర్‌ కాలనీ. చుట్టుపక్క ప్రజలు చెత్తను ఇక్కడే పడేస్తున్నారు. ప్రతిరోజూ తొలగించకపోవడంతో చెత్త డ్రైనేజీలో పేరుకుపోతోంది.

ఇది జిల్లాకేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలోని డంపర్‌బిన్‌. తహసీల్‌ చౌరస్తాలో ఉండడంతో త్వరగా నిండిపోతోంది. ప్రధాన ఆస్పత్రి, ప్రధానరోడ్డు కావడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.

చెత్త సేకరణలో నిర్లక్ష్యం1
1/8

చెత్త సేకరణలో నిర్లక్ష్యం

చెత్త సేకరణలో నిర్లక్ష్యం2
2/8

చెత్త సేకరణలో నిర్లక్ష్యం

చెత్త సేకరణలో నిర్లక్ష్యం3
3/8

చెత్త సేకరణలో నిర్లక్ష్యం

చెత్త సేకరణలో నిర్లక్ష్యం4
4/8

చెత్త సేకరణలో నిర్లక్ష్యం

చెత్త సేకరణలో నిర్లక్ష్యం5
5/8

చెత్త సేకరణలో నిర్లక్ష్యం

చెత్త సేకరణలో నిర్లక్ష్యం6
6/8

చెత్త సేకరణలో నిర్లక్ష్యం

చెత్త సేకరణలో నిర్లక్ష్యం7
7/8

చెత్త సేకరణలో నిర్లక్ష్యం

చెత్త సేకరణలో నిర్లక్ష్యం8
8/8

చెత్త సేకరణలో నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement