రాయికల్: మండలంలోని ఇటిక్యాల గ్రామంలోగల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఆలయ అర్చకులు జగన్మోహనార్యులు, కల్యాణచార్యులు ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహించారు. స్వామివారికి తులాభారం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బోడుగం మల్లారెడ్డి, సురకంటి నాగిరెడ్డి, సామల్ల వేణు, అనుపురం చిన్న లింబాద్రిగౌడ్, రఘునాథాచార్యులు, కనపర్తి శ్రీనివాస్, ఉట్నూరి
గంగాధర్ పాల్గొన్నారు.
కనులపండువగా వేంకటేశ్వరస్వామి కల్యాణం