చిట్టిచేతులతో అమ్మకోసం డిన్నర్.. వీడియో వైరల్.. | Sakshi
Sakshi News home page

అమ్మ కోసం డిన్నర్ ప్రిపేర్ చేసిన చిన్నారి.. క్యూట్ వీడియోకు నెటిజన్లు ఫిదా..

Published Sat, Sep 17 2022 8:03 PM

Viral Video Little Girl Prepares Dinner For Mother - Sakshi

బుడి బుడి అడుగులు వేసే ఓ రెండేళ్ల పసిపాప తన తల్లికోసం పసిప్రాయంలోనే చెఫ్‌గా మారింది. చిట్టిచేతులతో కూరగాయలు కట్‌ చేసి ప్రత్యేకంగా డిన్నర్ తయారు చేసింది. ఈ చిన్నారి ఎంతో ఓపికతో ఇష్టంగా ఆహారం వండిన తీరు నెటిజన్లను మంత్రముగ్దుల్ని చేసింది. ఆగస్టు చివరి వారంలో అప్‌లోడ్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ అయి నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఈ వీడియోలో చిన్నారి స్వయంగా కూరగాయలు కట్ చేసింది. వాటిని జాగ్రత్తగా బాయిలర్‌లో పెట్టింది. పాప పని చేస్తూనే క్యారట్ కొరుక్కుని తినడం చాలా క్యూట్‌గా అనిపించింది. అంతేకాదు ఆ తర్వాత చికెన్‌ కూడా వండింది. టిక్‌టిక్‌టిక్ అంటూ చికెన్ ముక్కలను ఎయిర్ ఫ్రయర్లో వేసింది. ఓ పాకెట్ రైస్‌ను మైక్రోవేవ్‌లో పెట్టి దానికి కాస్త ఆయిల్, యాపిల్ సైడర్ వెనిగర్ యాడ్ చేసింది. ఆ తర్వాత రైస్‌ను ఓ బౌల్‌లోకి తీసుకుంది.

చివరకు మొత్తం డిన్నర్‌ను ప్రిపేర్ చేసి టేబుల్‌పై పెట్టింది ఈ పసిపాప. ఆ తర్వత ఆమె తల్లి వచ్చాక.. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఈ డిన్నర్ చాలా రుచిగా ఉందంటూ తల్లి కూతుర్ని మెచ్చుకుని మురిసిపోయింది.  ఈ క్షణం కోసం, తన వ్యక్తిగత చెఫ్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.  చిన్నారి వీడియోను చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. వావ్‌, అమేజింగ్ అంటూ కొనియాడారు.

చదవండి: నిమిషంలోపే హెయిర్‌ కట్‌.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్‌ డ్రస్సర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement