నిమిషంలోపే హెయిర్‌ కట్‌.. గిన్నిస్ రికార్డు సృష్టించిన హెయిర్‌ డ్రస్సర్‌ | Haircut 47 Seconds Greece Hairdresser Guinness Record | Sakshi
Sakshi News home page

మైండ్‌లో ఫిక్సయితే బ్లైండ్‌గా ఫాలో అవుతాడు.. క్షణాల్లో క్షవరం..

Sep 15 2022 7:23 PM | Updated on Sep 15 2022 7:24 PM

Haircut In 47 Seconds Greece Hairdresser Guinness Record - Sakshi

గ్రీస్‌లోని ఏథెన్స్‌కు చెందిన కాన్సాంటినోస్‌ కౌటోపీస్‌... నిమిషంలోపే హెయిర్‌ కట్‌ చేసేస్తాడు. 47 సెకన్లలోనే అందమైన హెయిర్‌స్టైల్‌ చేసి.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కూడా సాధించాడు.

అర్జెంట్‌గా హెయిర్‌ కట్‌ చేయించుకోవాలా? అస్సలు టైమ్‌ లేదా? అయితే మీకు ఈ గ్రీక్‌ హెయిర్‌ డ్రెస్సర్‌ కావాల్సిందే. సాధారణ హెయిర్‌కట్‌ కోసం గ్రీక్‌ హెయిర్‌ డ్రస్సరెందుకు? అనేగా సందేహం. ఒక్కసారి మైండ్‌లో ఫిక్సయిపోతే.. బ్లైండ్‌గా ఫాలో అయ్యే ప్రొఫెషనల్‌ హెయిర్‌ డ్రస్సర్‌ ఈయన.

గ్రీస్‌లోని ఏథెన్స్‌కు చెందిన కాన్సాంటినోస్‌ కౌటోపీస్‌... నిమిషంలోపే హెయిర్‌ కట్‌ చేసేస్తాడు. 47 సెకన్లలోనే అందమైన హెయిర్‌స్టైల్‌ చేసి.. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కూడా సాధించాడు. ఓపికతో, ఎంత ఎక్కువ సమయం తీసుకుని కట్‌ చేస్తే.. అంతమంచి హెయిర్‌ స్టైల్‌ వస్తుందనే భావనకు చెక్‌ పెట్టేశాడు. ట్రిమ్మర్, కోంబ్‌ సహాయంతో చకచకా కట్‌ చేశాడు. గిన్నిస్‌ అధికారులు విడుదల చేసిన ఈ వీడియోను లక్షల మంది చూసేశారు. కొందరు సూపరని పొగుడుతుండగా, మరికొందరు బాలేదంటూ పెదవివిరిచారు.

చదవండి: మా గడ్డ మీలాగా కాదు.. పాక్‌కు తాలిబన్ల కౌంటర్‌

Advertisement
 
Advertisement
Advertisement