అమెరికాకు ఎదురుదెబ్బ.. నిఘా విమానం ధ్వంసం | US Spy Plane Destroyed | Sakshi
Sakshi News home page

అమెరికాకు ఎదురుదెబ్బ.. నిఘా విమానం ధ్వంసం

Mar 30 2026 12:00 AM | Updated on Mar 30 2026 10:28 AM

US Spy Plane Destroyed

పశ్చిమాసియా యుద్ధంలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తాజాగా సౌదీ అరేబియాలోని యుఎస్ ఎయిర్‌బేస్‌పై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకపడింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన అత్యాధునిక బోయింగ్ సెంట్రీ నిఘా విమానం దెబ్బతినట్లు ఇరాన్ పేర్కొంది. అదేవిధంగా దాదాపు 15మంది అమెరికా సైనికులకు గాయాలయ్యాయని తెలిపింది.

ఇరాన్‌, అమెరికా యుద్ధం మెుదలై దాదాపు నెలరోజులు గడుస్తోన్నా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఓ వైపు చర్చలు జరుపుతామని ట్రంప్ పేర్కొంటూనే మరోవైపు అమెరికా అదనపు బలగాల్ని ట్రంప్ మిడిల్‌ ఈస్ట్‌కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. కాగా తాజాగా సౌదీలోని అమెరికా ఎయిర్‌బేస్‌పై అమెరికా దాడి చేసింది. 

సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌ లక్ష్యంగా ఇరాన్ 6 బాలిస్టిక్ మిస్సైళ్లు, 29 డ్రోన్లతో దాడి చేసినట్లు ప్రకటించింది. ఈ అటాక్‌లో దాదాపు $700 మిలియన్ల రూ.5,800 కోట్లు విలువైన బోయింగ్ E-3 సెంట్రీ నిఘా విమానం ధ్వంసమైనట్లు పేర్కొంది. కాగా ఇరాన్ జరిపిన దాడిలో  15 మంది అమెరికా సైనికులు గాయపడగా వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ దాడిపై అమెరికా ఇదివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ప్రస్తుతం యుద్ధ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయు. USA తన యుద్ధనౌకలతో పాటు వేలాది మంది సైన్యాన్ని మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. దీంతో కంబాట్‌ ఆపరేషన్ చేపట్టనుందేమో అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement