భారీ సైనిక విన్యాసాలు.. అణుక్షిపణుల ప్రయోగం

U.S. and South Korea hold drills as North Korea launches missiles from submarine - Sakshi

వేడెక్కుతున్న కొరియా ద్వీపకల్పం

సియోల్‌: కొరియా ద్వీపకల్పం వేడెక్కుతోంది. ఒకవైపు అమెరికా– దక్షిణకొరియా భారీ సైనిక విన్యాసాలు ప్రారంభం కాగా, వీటిని సవాల్‌ చేస్తూ జలాంతర్గామి నుంచి అణు సామర్థ్యమున్న క్షిపణులను ఉత్తరకొరియా ప్రయోగించింది. దక్షిణకొరియా, అమెరికా సైనిక బలగాలు సోమవారం నుంచి భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు మొదలుపెట్టాయి. 2018 తర్వాత పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ఉమ్మడి విన్యాసాలు 11 రోజుల పాటు కొనసాగనున్నాయి.

అయితే, దక్షిణకొరియా, అమెరికాల చర్యలు తమ దేశ దురాక్రమణకు రిహార్సల్‌ వంటివని ఆరోపిస్తున్న ఉత్తరకొరియా దీనికి నిరసనగా ఆదివారం జలాంతర్గామి నుంచి రెండు క్షిపణులను ప్రయోగించింది. ఈ రెండు క్షిపణులు వ్యూహాత్మక ఆయుధాలని అధికార వార్తాసంస్థ కేసీఎన్‌ఏ అభివర్ణించింది. దేశ అణు సామర్థ్యాన్ని ఇవి చాటుతున్నాయని తెలిపింది. ఇవి రెండు గంటలపాటు గాలిలోనే ఉన్నాయని, 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సత్తా ఉందని తెలిపింది. అయితే, ఉత్తరకొరియా జలాంతర్గామి నుంచి అణు వార్‌హెడ్లను మోసుకెళ్లే క్షిపణుల పరిజ్ఞానాన్ని సాధించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top