
వాషింగ్టన్: అమెరికా డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడైన చార్లీ కిర్క్‌ను కాల్చి చంపిన హంతకుడు ఎట్టకేలకు దొరికిపోయాడు. 22 ఏళ్ల టైలర్ రాబిన్సన్ ఈ హత్యకు పాల్పడ్డాడని, అతడిని అరెస్టు చేశామని ఎఫ్‌బీఐ అధికారులు శుక్రవారం ప్రకటించారు. హంతకుడిని బంధించినట్లు యూటా రాష్ట్ర గవర్నర్ స్పెన్సర్ కాక్స్ ధ్రువీకరించారు.
చార్లీ కిర్క్‌ను హత్య చేసింది టైలర్ రాబిన్సన్ అనే విషయం అతడి కుటుంబ సభ్యులకు తెలిసిన వెంటనే వారు ఆ విషయాన్ని తమ కుటుంబ మిత్రుడికి చేరవేశాడు. ఆ మిత్రుడు పోలీసు అధికారులను సంప్రదించి సమాచారం అందించాడు. పోలీసులు రంగంలోకి దిగి రాబిన్సన్‌ను అరెస్టు చేశారు. తాను ఈ నేరం చేశానని అతడు ఒప్పుకున్నట్లు సమాచారం. రాబిన్సన్ ఈ మధ్య కాలంలో రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో ట్రంప్ మిత్రుడైన చార్లీ కిర్క్ వ్యవహార శైలి అతడికి నచ్చలేదు. అందుకే హత్య చేసినట్లు తెలుస్తోంది.