Turkiye Earthquake Survivor: టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు..

Turkiye Earthquake Survivor Drank Own Urine - Sakshi

ఇస్తాన్‌బుల్‌: తుర్కియే, సిరియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. భూకంపం దాటికి ఇళ్లు కూలిపోవడంతో అనేక మంది శిథిలాల కిందే చిక్కుకున్నారు. కొందరు ప్రాణాలతో బయటపడగా.. మరొకొందరు మాత్రం తమ కుటుంబసభ్యులను కోల్పోయారు. 

అయితే సోమవారం శిథిలాల కింద చికుక్కున్న 17 ఏళ్ల యువకుడు అద్నాన్ ముహమ్మెత్ కోర్కుట్‌ అనూహ్యంగా నాలుగు రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. 94 గంటలపాటు శిథిలాల కిందే బిక్కుబిక్కుమంటూ గడిపిన అతడు గొంతు ఎండిపోకుండా తన మూత్రం తాగి బతికినట్లు భయానక విషయాలు వెల్లడించాడు.  ఈ నాలుగు రోజులు ఎలా గడిచాయో స్వయంగా అతని మాటాల్లోనే..

'సోమవారం   ఇంట్లో నిద్రోపోయా. ఒక్కసారిగా భూకంపం రావడంతో ఇళ్లు కూలిపోయింది. నేను శిథిలాల కింద చిక్కుకున్నా. బయటకు రాలేని పరిస్థితి. సహాయక సిబ్బందికి నేను కన్పిస్తానే లేదో అని భయం వేసింది. నిద్రపోవద్దని ఫోన్లో ప్రతి 25 నిమిషాలకు అలారం పెట్టుకున్నా. రెండు రోజుల తర్వాత బ్యాటరీ అయిపోయి ఫోన్ స్విచాఫ్ అయింది. నాకు బాగా దాహం వేసినప్పుడు నా మూత్రమే తాగా. ఆకలి వేసినప్పుడు ఇంట్లోని పూలు తిన్నా. చివరకు 94 గంటల తర్వాత సహాయక సిబ్బంది నాకు కన్పించారు. కానీ నా మాటలు వారికి వినపడుతాయో లేదో అని ఆందోళన చెందా. శిథిలాలు తొలిగించేటప్పుడు నన్ను చూడకపోతే వాటి కిందే నలిగిపోతా అనుకుని భయపడ్డా. కానీ చివరకు నన్ను వారు చూసి క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. నన్ను కాపాడిన వాళ్లకి రుణపడి ఉంటా.' అని యువకుడు ఆస్పత్రిలో తన నాలుగు రోజుల నరకయాతన వివరించాడు.

తుర్కియే, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 24వేల మందికిపైగా చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకున్న ఎంతోమందిని సహాయక సిబ్బంది రక్షించారు. వీరిలో చిన్నారులు, అప్పడే పుట్టిన పసికందులు కూడా కన్పించారు. కొందరు తల్లిదంద్రులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి బిడ్డలను కాపాడుకున్నారు.
చదవండి: కన్నీరు పెట్టిస్తున్న వీడియో.. తన ప్రాణాలు అడ్డేసి కుమారుడ్ని కాపాడిన తండ్రి..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top