26 దేశాలకు ప్రయాణాలు నిషేధిస్తూ ట్రంప్‌ నిర్ణయం

Trump travel ban on UK, Ireland, Brazil - Sakshi

వాషింగ్టన్‌: పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సెహెజెన్‌ జోన్‌ పరిధిలోని 26 దేశాలకు రవాణాపరమైన ఆంక్షలు విధించారు. వాటిలో యూకే, ఐర్లాండ్‌, బ్రెజిల్‌ తదితర దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు అమెరికా నుంచి ప్రయాణాలను నిషేధించారు. ఆ దేశాలకు జనవరి 26వ తేదీ వరకు నిషేధం విధిస్తూ ట్రంప్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మృతులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఆ దేశంలో మొత్తం 2,41,10,876 కేసులు నమోదవగా, మృతులు 3,98,915మంది ఉన్నారు. ఇంకా కరోనా తీవ్ర రూపంలో విజృంభిస్తోంది. అయితే కొత్త రకం వైరస్‌ బ్రిటన్‌, బ్రెజిల్‌లో వెలుగులోకి రావడంతో ఈ మేరకు ట్రంప్‌ ఆ దేశాల నుంచి ప్రయాణాలను నిషేధించారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top