భయంకర వీడియో.. ఎవరిది పై చేయి..

Terrifying Video Of Black Panther And Anaconda Fight - Sakshi

అనకొండ, బ్లాక్‌ పాంథర్‌(నల్ల చిరుతపలి) మధ్య ఫైట్‌ జరుగుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి ఇది 2013లోనే బయటకొచ్చిన వీడియో. అయితే అమెరికాలోని ఓ వ్యక్తి ఇటీవల ట్విటర్‌లో పోస్టు చేయడంతో ఈ వీడియో మరోసారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. దక్షిణ అమెరికాలోని గ్రీన్‌ అనకొండ ప్రపంచంలోనే అతిపెద్ద పాము. అదే విధంగా జాగ్వార్‌ విషయానికొస్తే అమెరికాలోనే ఇది పెద్ద పిల్లి. ఈ రెండు తమ బలాన్ని నిరూపించుకునేందుకు తలపడితే ఆ దృశ్యాలు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో ఉంది. ఇందులో ఈ రెండు భయంకరంగా పోరాడుతూ.. నీటిలోకి, నేల మీదికి లాక్కుంటూ వేటికవే తమ బలాన్ని ప్రదర్శిస్తున్నాయి. చదవండి: నెవెర్‌ బిఫోర్‌..ఎవర్‌ ఆఫ్టర్‌ ఫైట్‌ సీన్‌!

ఈ వీడియోలో మెలనిస్టిక్ జాగ్వార్ దీనినే బ్లాక్ పాంథర్ అని కూడా పిలుస్తారు. ఇది  భారీ అనకొండను నీటి నుంచి బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంది. అయితే పాము మాత్రం బ్లాక్‌ పాంథర్‌నుంచి తప్పించుకునేందుకు నీటిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ అనకొండను వదలకుండా పట్టు బిగిస్తూ భూమి మీదకు లాగుతోంది. మరి ఈ పోరాటంలో ఎవరిది పై చేయి సాధించిందనేది తెలియలేదు. దీనిని చూసిన నెటిజన్లు.. జాగ్వార్‌ అద్భుతంగా పోరాడిందని, వీడియో భయంకరంగా ఉందని కామెంట్‌ చేస్తున్నారు. కాగా ఈ అనకొండలు ప్రపంచంలోనే అత్యంత భారీ పాములలో ఒకటి. అంతేగాక 130 కిలోల వరకు బరువు కలిగి ఉంటాడి.  వీటికి నీటిలో వేగం అమితంగా ఉంటుంది. అయితే భూమిపై వీటి బలం తక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ నీళ్లున్న ప్రదేశాల సమీపంలోనే ఎక్కువగా నివసిస్తుంటాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top