Omicron: నైట్‌​ కర్ఫ్యూ ఎత్తివేత! ఎందుకో తెలుసా..

South Africa Has Lifted Night Curfew Imposed Nearly 2 Years Ago - sakshi - Sakshi

కేప్ టౌన్: గడచిన ఏడు రోజులతో పోలిస్తే గత వారంలో దాదాపు 30 శాతం ఒమిక్రాన్‌ ఇన్ఫెక్షన్లు తగ్గాయని దక్షిణాఫ్రికా తాజాగా వెల్లడించింది. ఒమిక్రాన్‌కు బయపడి యూరఫ్‌, అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించిస్తున్న నేపధ్యంలో నాలుగో వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం రాత్రి కర్ఫ్యు ఎత్తివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. మరణాలు కూడా పెద్దగా నమోదు కాలేదని, వ్యాక్సినేషన్‌ పెద్ద సంఖ్యలో చేపట్టడం మూలంగా నాలుగో వేవ్‌ నుంచి బయటపడ్డామని తాజా ఆరోగ్య డేటా నేపథ్యంలో ఆంక్షలు సడలించాలని నిర్ణయించుకున్నట్లు దక్షిణాఫ్రికా ఈ మేరకు మీడియాకు తెల్పింది. సార్స్‌- కోవ్‌ 2 వైరస్‌కు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ నవంబర్‌లో మొదటిసారి దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. 

చదవండి: కొత్తొక వింత.. పాతొక రోత!

డిసెంబరు 25 నాటికి నమోదైన కేసులతో పోల్చితే, అంతకు ముందు వారాల్లో దాదాపు 1,27,753 కేసులు వచ్చాయని, ఆ సంఖ్య 29.7% తగ్గిందని ప్రభుత్వం తెల్పింది. సడలించిన ఆంక్షల మేరకు వెయ్యి మందితో ఇండోర్‌ మీటింగ్లు, రెండు వేల మంది సామర్ధ్యంతో ఔట్‌డోర్‌ మీటింగ్లు నిర్వహించుకోవచ్చు. అలాగే లైసెన్సులున్న మద్యం దుకాణాలు రాత్రి 11 గంటల తర్వాత కూడా తెరచుకోవచ్చు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం తప్పనిసరి. అలా చేయని పక్షంలో క్రిమినల్‌ నేరంగా పరిగణించబడుతుందని సూచించింది. కాగా గత రెండేళ్లుగా దక్షిణాఫ్రికాలో నైట్‌ కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్ 100కి పైగా దేశాలకు వ్యాపించిందని, వ్యాక్సిన్‌ వేయించుకున్న వ్యక్తులతో పాటు కరోనా సోకిన వారిలో కూడా కొత్త వేరియంట్‌ వ్యాపిస్తోందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

చదవండి: డిసెంబర్‌ 31 రాత్రి పార్టీ వెరైటీగా ఎలా ప్లాన్‌ చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఐడియాలివిగో..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top