పుతిన్‌కు ఊహించని షాక్‌.. అధికారానికి బీటలు!

Russian Valentin Yumashev Quits As Putin Adviser - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా రష్యా మాజీ అధ్యక్షుడు బోరిస్‌ ఎల్త్సిన్‌ అల్లుడు వాలెంటిన్‌ యుమషేవ్‌ పుతిన్‌ సలహాదారు పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన ఎల్త్సిన్‌ హయాం నుంచీ అధ్యక్ష సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పుతిన్‌ అధికారానికి బీటలు పడుతున్నాయని, సైన్యం మీదా ఆయన పట్టు తగ్గుతోందని వస్తున్న వార్తలకు బలం చేకూరింది. యుమషేవ్‌ కూతురు ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది నెలల క్రితం సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టింది.  

ఇదిలా ఉండగా.. యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలపర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతులను వచ్చే ఆరు నెలల్లో ఏకంగా 90 శాతం తగ్గించుకునేందుకు యూరప్‌ దేశాలన్నీ అంగీకరించాయి. ఈ నిర్ణయంతో రష్యా నుంచి సముద్ర మార్గాన జరిగే యూరప్‌కు ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది.

మరోవైపు.. డెన్మార్క్‌కు మంగళవారం నుంచి చమురు సరఫరాలు ఆపేస్తున్నట్టు రష్యా ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం గజ్‌ప్రోమ్‌ ప్రకటించింది. తమ పట్ల విద్వేషమే ఏకైక ప్రాతిపదికగా ఈయూ ఈ నిర్ణయం తీసుకుందని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వేదేవ్‌ దుయ్యబట్టారు. అంతకుముందు బల్గేరియా, పోలాంట్‌, ఫిన్లాండ్‌లకు చమురు ఎగుమతులను రష్యా నిలిపివేసిన విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి:  పెళ్లయిందని ప్రకటించిన 4 నెలలకే తల్లయిన స్టార్‌ హీరోయిన్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top